Volodymyr Zelensky | ‘నేనొక మంచి తండ్రిగా లేను’.. ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన
Volodymyr Zelensky | తానొక మంచి తండ్రిగా లేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine President) వాలోదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelensky) ఆవేదన వ్యక్తంచేశారు. రష్యా దురాక్రమణను అడ్డుకునే క్రమంలో భద్రతా కారణాలరీత్యా తాను తన పిల్లలను చూడలేకపోతున్నానని, వారికి సమయం కేటాయించలేకపోతున్నానని చెప్పారు.
Volodymyr Zelensky : తానొక మంచి తండ్రిగా లేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine President) వాలోదిమిర్ జెలెన్స్కీ (Volodymyr Zelensky) ఆవేదన వ్యక్తంచేశారు. రష్యా దురాక్రమణను అడ్డుకునే క్రమంలో భద్రతా కారణాలరీత్యా తాను తన పిల్లలను చూడలేకపోతున్నానని, వారికి సమయం కేటాయించలేకపోతున్నానని చెప్పారు. కాగా రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకుపైగా యుద్ధం కొనసాగుతోంది. దాంతో తాను తన కుటుంబాన్ని ఎంత మిస్సవుతున్నాడో జెలెన్స్కీ చెప్పారు.
మాస్కోతో యుద్ధంవల్ల తాను తన కుటుంబానికి సమయం వెచ్చించలేకపోతున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం సమయంలో కుటుంబానికి ఎక్కువ సమయం వెచ్చించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడిగా దేశాన్ని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తన పిల్లలకు సమయం కేటాయించలేకపోతున్నానని, వారికి మంచి తండ్రిగా ఉండలేకపోతున్నానని ఉద్వేగానికి గురయ్యారు.
దేశంలో శాంతి నెలకొల్పేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా యుద్ధ సమయంలో తన పిల్లలను చూడలేకపోవడం గురించి జెలెన్స్కీ గతంలోను మాట్లాడారు. మాస్కో దురాక్రమణలను అడ్డుకునే శక్తి అమెరికాకు ఉందన్నారు. యుద్ధం ముగింపునకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావాలని యూఎస్‌ను కోరారు. మార్చిలో అమెరికా నేతృత్వంలో శాంతి చర్చలు జరిగే అవకాశం ఉందని చెప్పారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

