జెరుసలాం: ఇరాన్‌పై ఇవాళ ఇజ్రాయెల్ ఆకస్మిక దాడి(Israel Attack) చేసింది. టెహ్రాన్‌పై క్షిపణుల వర్షం కురిపించింది. అయితే అమెరికా సహకారంతో ఆ అటాక్ జరిగినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇరాక్ భూభాగం మీదుగా ఇవాళ ఉదయం క్షిపణులు ప్రయాణించి.. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో టార్గెట్‌ను ఢీకొట్టాయి. అయితే ఇరాక్ మీదుగా మిస్సైళ్లు ప్రయాణిస్తున్న దృశ్యాలకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇరాక్ భూభాగం మీదుగా .. చాలా తక్కువ ఎత్తులో ఆ క్షిపణలు ప్రయాణించినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది.
טילי השיוט בדרך לטהראן pic.twitter.com/PRtnbMzZwV
— David Lisovtsev (@david_lisovtsev) February 28, 2026
ఈ దాడి కోసం చాన్నాళ్ల నుంచి ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్లు స్పష్టం అవుతోంది. కొన్ని నెలల క్రితమే ఈ ప్లాన్ జరిగినట్లు ఓ సెక్యూర్టీ అధికారి తెలిపారు. పూర్తి స్థాయిలో సమరానికి దిగినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. అమెరికా కూడా తమకు అండగా ఉన్నట్లు పేర్కొన్నది. అయితే ప్రారంభ దశ దాడికి చెందిన ప్లానింగ్ నాలుగు రోజుల క్రితం జరిగినట్లు చెబుతున్నారు. ఇరానీ ప్రజలను సర్ప్రైజ్ చేయాలన్న ఉద్దేశంతోనే పగటి పూట దాడులు చేపట్టినట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అధికారులు కానీ, ప్రజలు కానీ.. ఉదయం పూట దాడులను అంచనా వేసి ఉండరని అంటున్నారు.
తాజాగా ఇరాన్‌తో జరిగిన చర్చలు సఫలం కాకపోవడం పట్ల ట్రంప్ అసంతృప్తితో ఉన్నారు. ఇరాన్ అణ్వాయుధాలను సమీకరించడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. యురేనియం శుద్దీకరణ సామర్థ్యాన్ని ఇరాన్ కలిగి ఉండటాన్ని అమెరికా తప్పుపడుతున్న విషయం తెలిసిందే. ఏదో ఒక దశలో సైనిక బలాన్ని వాడాల్సి వస్తుందని గురువారమే ట్రంప్ పేర్కొన్నారు.