ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే (Eknath Shinde) మరోసారి సంచలనం రేపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రసంగం చివర్లో ‘జై గుజరాత్’ అని అన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శుక్రవారం పూణేలోని కోంధ్వాలో జైరాజ్ స్పోర్ట్స్ అండ్ కన్వెన్షన్ సెంటర్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ఈ సందర్భంగా మాట్లాడారు. అయితే ప్రసంగాన్ని ముగించే ముందు అమిత్ షా గౌరవార్థం షేర్-షాయారీ వినిపించవచ్చా అని సభికులను అడిగారు. అక్కడున్న వారు సానుకూలంగా స్పందించారు.
కాగా, ప్రసంగం ముగించిన తర్వాత ఏక్నాథ్ షిండే సభికులకు కృతజ్ఞతలు తెలిపారు. చివరన ‘జై హింద్, జై మహారాష్ట్ర’ అని అన్నారు. కొద్దిసేపు ఆగిన తర్వాత ‘జై గుజరాత్’ అని నినాదించారు. దీంతో ఆ కార్యక్రమానికి హాజరైన వారు ఆశ్చర్యపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మెప్పు కోసం ‘జై గుజరాత్’ అని ఏక్నాథ్ షిండే అనడం చర్చకు దారి తీసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#Pune: Eknath Shinde Ends Speech With ‘Jai Gujarat’ In Amit Shah’s Presence #Maharashtra #ShivSena pic.twitter.com/0RRuO4Gifc
— Free Press Journal (@fpjindia) July 4, 2025
Also Read:
Watch: స్కూల్కు వెళ్లేందుకు.. ప్రవహించే నదిని ప్రమాదకరంగా దాటుతున్న చిన్నారులు