Finn Allen | టీ20 ప్రపంచకప్‌లో ఫిన్ అలెన్ సంచలనం… 33 బంతుల్లో సెంచరీ, గేల్–యువరాజ్ రికార్డులు బద్దలు
Finn Allen | ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే శతకం బాది ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యానికి గురిచేశాడు. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఫిన్ అలెన్ కొత్త రికార్డు నెలకొల్పాడు.
Finn Allen | ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే శతకం బాది ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యానికి గురిచేశాడు. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్‌గా ఫిన్ అలెన్ కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా వేదికగా జరిగింది. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా కూడా ఫిన్ అలెన్ చరిత్రకెక్కాడు. అంతేకాకుండా నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు తిలకరత్నే దిల్షాన్ పేరిట ఉండేది. ఆయన 2009 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో వెస్టిండీస్‌పై 96 పరుగులు చేశాడు. తాజాగా అలెన్ శతకంతో ఆ రికార్డు చెదిరిపోయింది.
టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు:
100 – ఫిన్ అలెన్ vs సౌతాఫ్రికా, కోల్‌కతా, 2026 సెమీఫైనల్
96 – తిలకరత్నే దిల్షాన్ vs వెస్టిండీస్, 2009 సెమీఫైనల్
89 – విరాట్ కోహ్లీ vs వెస్టిండీస్, 2016 సెమీఫైనల్
86 – అలెక్స్ హేల్స్ vs భారత్, 2022 సెమీఫైనల్
85 – మార్లన్ శామ్యూల్స్ vs ఇంగ్లాండ్, 2016 ఫైనల్
85 – కేన్ విలియమ్సన్ vs ఆస్ట్రేలియా, 2021 ఫైనల్
క్రిస్ గేల్ రికార్డు బద్దలు
ఈ సెంచరీతో ఫిన్ అలెన్ మరో అరుదైన రికార్డును కూడా సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యంత వేగవంతమైన సెంచరీ క్రిస్ గేల్ పేరిట ఉండేది. ఆయన 2016లో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌పై 47 బంతుల్లో శతకం బాదాడు. ఇప్పుడు అలెన్ కేవలం 33 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి గేల్ రికార్డును అధిగమించాడు.
అంతర్జాతీయ టీ20ల్లో న్యూజిలాండ్ తరఫున కూడా ఇదే అత్యంత వేగవంతమైన సెంచరీ. ఇంతకుముందు ఈ రికార్డు గ్లెన్ ఫిలిప్స్ పేరిట ఉండేది. ఆయన 2020లో వెస్టిండీస్‌పై 46 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఫిన్ అలెన్ తాజా శతకంతో ఆ రికార్డు కూడా చెదిరిపోయింది.
యువరాజ్ సింగ్ రికార్డు కూడా చెదిరింది
ఈ మ్యాచ్‌లో అలెన్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యంత వేగంగా అర్ధశతకం చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డు కూడా బద్దలైంది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై యువరాజ్ 20 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఫిన్ అలెన్ అద్భుత శతకంతో న్యూజిలాండ్ జట్టు సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో న్యూజిలాండ్ ఫైనల్‌కు దూసుకెళ్లగా, సౌతాఫ్రికా ప్రయాణం సెమీఫైనల్ దశలోనే ముగిసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్‌లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

