తిరువనంతపురం: కేరళలో మళ్లీ నిపా వైరస్ (Nipah Virus) కలకలం రేపుతున్నది. ఇద్దరు వ్యక్తుల్లో నిపా వైరస్ లక్షణాలు గుర్తించారు. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు జిల్లాల్లో అలెర్ట్ ప్రకటించారు. కోజికోడ్, మలప్పురంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించగా రెండు అనుమానిత నిపా కేసులు వెలుగులోకి వచ్చాయి. మలప్పురం, పాలక్కాడ్ జిల్లాలకు చెందిన వ్యక్తుల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు.
కాగా, కేరళలో మరోసారి నిపా వైరస్ వ్యాప్తిపై ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. కోజికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాల్లో ఆరోగ్యపరంగా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. కాంటాక్ట్ ట్రేసింగ్, రోగ లక్షణాల గుర్తింపుతోపాటు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ప్రాంతంలో 26 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఏవైనా అసహజ మరణాలు సంభవించాయా అన్నది తనిఖీ చేయాలని అధికారులను కోరినట్లు వివరించారు.
Also Read:
Eknath Shinde | ‘జై గుజరాత్’ అంటూ.. ప్రసంగం ముగించిన ఏక్నాథ్ షిండే
Bihar university | ఒక విద్యార్థికి వందకు 257 మార్కులు.. తప్పులతడకగా యూనివర్సిటీ ఫలితాలు