లక్నో: వీధి కుక్క మొరగడంపై రిటైర్డ్ పీడబ్యూడీ ఇంజినీర్ ఆగ్రహించాడు. రివాల్వర్‌తో ఆ కుక్కపై కాల్పులు జరిపాడు. (Retired PWD Engineer Fires At Stray Dog) దీంతో అది మరణించింది. ఇది చూసి స్థానికులు మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఈ సంఘటన జరిగింది. నజీబాబాద్ ప్రాంతంలో రిటైర్డ్ పీడబ్యూడీ ఇంజినీర్ నివసిస్తున్నాడు. వీధి కుక్క అతడ్ని చూసి మొరగడంపై ఆగ్రహించాడు. లైసెన్స్ ఉన్న రివాల్వర్‌తో ఆ కుక్కపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఆ కుక్క కాలువలో పడి మరణించింది.
కాగా, స్థానికులు ఇది చూసి ఆగ్రహించారు. రిటైర్డ్ పీడబ్యూడీ ఇంజినీర్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో అతడు తన ఇంటికి లాక్ వేసుకుని లోపల ఉండిపోయాడు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రిటైర్డ్ ఇంజినీర్ వద్ద రివాల్వర్ ఉండటంపై భయాందోళన వ్యక్తం చేశారు. రివాల్వర్ లైసెన్స్ రద్దు చేయాలని, అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఈ సంఘటన పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలని బిజ్నోర్ పోలీసులను ఆదేశించారు.
Also Read:
Air India Express | ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు.. రహస్యంగా డీజీసీఏ వార్నింగ్
Nipah Virus | కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం.. మూడు జిల్లాల్లో అలెర్ట్
Bihar university | ఒక విద్యార్థికి వందకు 257 మార్కులు.. తప్పులతడకగా యూనివర్సిటీ ఫలితాలు