Virosh | టాలీవుడ్లో మోస్ట్ లవబుల్ కపుల్‌గా పేరొందిన విజయ్ దేవరకొండ-రష్మిక జంట ఇటీవల వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజస్థాన్‌లోని అద్భుతమైన ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఈ జంట పెళ్లి ఘనంగా జరిగింది. రాజరిక వేడుకలను తలపించేలా నిర్వహించిన ఈ వివాహానికి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకలు దాదాపు వారం రోజుల పాటు జరగడం విశేషం. ఉదయ్‌పూర్‌లో పెళ్లి అనంతరం, విజయ్ స్వగ్రామంలో సంప్రదాయ పూజలు, సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. అనంతరం సంగీత్ కార్యక్రమం, అభిమానులతో ప్రత్యేక సమావేశం, చివరగా హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ వంటి పలు వేడుకలు వరుసగా నిర్వహించారు. ఈ మొత్తం కార్యక్రమం ఒక పెద్ద సెలబ్రేషన్‌లా సాగింది.
ఈ నేపథ్యంలో ఈ స్టార్ జంట పెళ్లికి ఎంత ఖర్చు అయ్యిందన్న విషయంపై సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, మొత్తం పెళ్లి వేడుకలకు దాదాపు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. పెళ్లి షాపింగ్, నగలు, ఉదయ్‌పూర్‌లో జరిగిన వేడుకలు, స్వగ్రామంలో నిర్వహించిన విందు, సంగీత్ పార్టీ, అభిమానులతో మీట్, అలాగే హైదరాబాద్ రిసెప్షన్ అ్లన్ని కలిపి ఇంతటి భారీ ఖర్చు అయిందని అంటున్నారు ముఖ్యంగా ఈ పెళ్లిలో ధరించిన బంగారు ఆభరణాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. సమాచారం ప్రకారం, ఈ జంట పెళ్లి సందర్భంగా మొత్తం మూడు కిలోల బంగారు నగలు ధరించారట. అందులో రష్మిక మందన్నా దాదాపు రెండు కిలోల బంగారు ఆభరణాలు ధరించగా, విజయ్ దేవరకొండ సుమారు ఒక కిలో వరకు నగలు ధరించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
పెళ్లి ఏర్పాట్లన్నీ ఒక ప్రముఖ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ద్వారా నిర్వహించబడినట్లు సమాచారం. ఈ ఖర్చును విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ఇద్దరూ కలిసి భరించారని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పెళ్లి టాలీవుడ్లో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ వివాహాల్లో ఒకటిగా నిలిచిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు నాగ చైతన్య-సమంత పెళ్లి కూడా భారీ స్థాయిలో జరిగి వార్తల్లో నిలిచింది. ఆ సమయంలో సుమారు రూ.10 కోట్ల వరకు ఖర్చు అయ్యిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు విజయ్ – రష్మిక వివాహం ఆ రికార్డును కూడా మించిందనే చర్చ జరుగుతోంది.