US-Israel-Iran War : ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో రెండు పక్షాల మధ్య అవసరమైతే మధ్యవర్తిత్వం వహిస్తామని చైనా ప్రకటించింది. దీనిపై ఇప్పటికే చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి గల్ఫ్ దేశాధినేతలతో ఫోన్లో చర్చలు జరిపారని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ వెల్లడించారు. యూఏఈ ఉప ప్రధాని అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్సహా పలువురు నేతలతో మాట్లాడినట్లు తెలిపారు. అలాగే రష్యా, ఒమన్, ఫ్రాన్స్, ఇరాన్, ఇజ్రాయెల్‌తో కూడా చర్చించినట్లు చెప్పారు.
దౌత్యపరమైన చర్చల ద్వారా యుద్ధానికి ముగింపు పలికేలా, శాంతి నెలకొనేలా చూస్తామని ఆయన అన్నారు. ఈ ప్రయత్నంలో చైనా చివరిదాకా ప్రయత్నిస్తుందని, నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇందుకోసం తమ దేశం నుంచి ప్రత్యేక ప్రతినిధిని కూడా పంపిస్తామన్నారు. అన్ని పక్షాలు తక్షణమే కాల్పులు ఆపాలని కూడా చైనా కోరింది. చర్చలు, సంప్రదింపులపై దృష్టిసారించి, త్వరగా ఉద్రిక్తతలు తగ్గించాలని సూచించింది. ఈ విషయంలో శాంతి చర్చలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించిన సౌదీ అరేబియా వైఖరిని అభినందిస్తున్నట్లు చైనా పేర్కొంది. మరోవైపు ఇరాన్లో చిక్కుకున్న చైనా ప్రజల్ని రక్షించేందుకు కూడా ఆ దేశం ప్రయత్నిస్తోంది. ఇరాన్లో చిక్కుకున్న 3,000 మందిని రక్షించి, తీసుకొచ్చింది.
Chinese FM Wang Yi held a phone conversation with Saudi FM Faisal bin Farhan Al Saud.
The spreading and escalating conflict in the Middle East, affecting Saudi Arabia and other Gulf countries, is not what China wishes to see. China appreciates Saudi Arabia’s restraint and its… pic.twitter.com/nrPQotlDQo
— Lin Jian 林剑 (@SpoxCHN_LinJian) March 5, 2026
ఇటీవల ఇండియా కూడా ఇదే వైఖరి ప్రకటించింది. ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకాలని కోరింది. యుద్ధాన్ని త్వరగా ముగిస్తే శాంతి నెలకొంటుందని, మరణాల సంఖ్యను తగ్గించవచ్చని అభిప్రాయపడింది. ఉక్రెయిన్ అయినా, పశ్చిమ ఆసియా అయినా సైనిక చర్యతో ఎలాంటి సమస్య పరిష్కారం కాదని ప్రధాని మోదీ కూడా అభిప్రాయపడ్డారు.