న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాలో భాగమైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను (Air India Express) ఏవియేషన్ రెగ్యులేటర్ అయిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రహస్యంగా హెచ్చరించింది. ఎయిర్‌బస్ ఏ320లో ఇంజిన్ భాగాల మార్పులో వైఫల్యం, తప్పుడు రికార్డులపై మందలించింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ అథారిటీ ఆదేశించిన విధంగా ఎయిర్‌బస్ ఏ320లో ఇంజిన్ భాగాలను వెంటనే మార్చడంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విఫలమైంది. అలాగే ప్రమాణాలకు అనుగుణంగా రికార్డులు ఉన్నట్లు తప్పుగా చూపించడంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఏడాది మార్చిలో ఈ మేరకు రహస్య మెమోను ప్రభుత్వం జారీ చేసిన విషయం తమకు తెలిసిందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.
కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ దీనిని ధృవీకరించింది. తమ లోపాలను అంగీకరించింది. డీజీసీఏ నోటీస్‌కు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు రాయిటర్స్‌కు తెలిపింది. ఎయిర్‌బస్ ఏ320 ఇంజిన్‌లో విడిభాగాల మార్పును నిర్దేశించిన కాలపరిమితిలోపు చేయకపోవడాన్ని డీజీసీఏ గుర్తించి హెచ్చరించినట్లు ఆ వివరణలో ఒప్పుకున్నది.
Also Read:
Nipah Virus | కేరళలో మళ్లీ నిపా వైరస్ కలకలం.. మూడు జిల్లాల్లో అలెర్ట్
Eknath Shinde | ‘జై గుజరాత్’ అంటూ.. ప్రసంగం ముగించిన ఏక్నాథ్ షిండే