భోపాల్: ప్రభుత్వ స్కూల్స్‌కు పెయింట్ వేయకుండానే ఆ పేరుతో లక్షల్లో నకిలీ బిల్లులు సృష్టించారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారు. ఎలాంటి తనిఖీ లేకుండా అధికారుల ఆమోదం పొందిన ఈ బిల్లుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (Madhya Pradesh Scam) బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ స్కామ్ బయటపడింది. షాడోల్ జిల్లాలోని రెండు ప్రభుత్వ స్కూల్స్‌కు పెయింట్ వేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించారు. సకాండి గ్రామంలోని ప్రభుత్వ స్కూల్ గోడకు పెయింట్ వేసేందుకు రూ.1.07 లక్షలు ఖర్చైనట్లు బిల్లులో పేర్కొన్నారు. దీని కోసం 168 మంది కూలీలు, 65 మంది మేస్త్రీలు పని చేసినట్లు చూపించారు. నాలుగు లీటర్ల పెయింట్ వినియోగించినట్లు ఖర్చులు రాశారు.
కాగా, నిపానియా గ్రామంలోని మరో ప్రభుత్వ స్కూల్లో పది కిటికీలు, నాలుగు తలుపులకు రంగు వేయడానికి 275 మంది కూలీలు, 150 మంది మేస్త్రీలను నియమించినట్లు చూపించారు. 20 లీటర్ల పెయింట్ వినియోగించినట్లు పేర్కొన్నారు. రూ.2.3 లక్షలకుపైగా వ్యయం అయ్యిందని బిల్లులు సృష్టించారు.
మరోవైపు వాస్తవానికి ఈ రెండు ప్రభుత్వ స్కూల్స్‌లో ఎలాంటి పెయింట్ పని జరుగలేదు. పెయింట్ వేసినట్లుగా ఎలాంటి ఫొటోలు లేదా ఆధారాలు కూడా లేవు. అయినప్పటికీ సుధాకర్ కన్స్ట్రక్షన్ అనే నిర్మాణ సంస్థ ఈ పనులు చేసినట్లు ఈ ఏడాది మే 5 తేదీతో బిల్లులు సృష్టించారు.
కాగా, నిపానియా గ్రామంలోని ప్రభుత్వ స్కూల్ ప్రిన్సిపాల్ విచిత్రంగా నెల ముందే, అంటే ఏప్రిల్ 4నే ఆ బిల్లును ఆమోదించి సంతకం చేశారు. ఈ రెండు బిల్లుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దర్యాప్తు జరిపి చర్యలు చేపడతామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.
Also Read:
Mooli Devi | పోలీసులనే బురిడీకొట్టించిన మహిళ.. పోలీస్ అకాడమీలో ఎస్ఐగా రెండేళ్లు ట్రైనింగ్
Woman, Lover Arrested | భర్త, పిల్లలకు విషమిచ్చి చంపేందుకు యత్నం.. భార్య, ఆమె ప్రియుడు అరెస్ట్
Black Magic | భార్య, అత్తను నగ్నంగా చేతబడి చేయాలని వ్యక్తి బలవంతం.. ఆ ఫొటోలు లీక్