Sangeetha | తమిళ స్టార్ హీరో, టీవీకే అధినేత విజయ్ వ్యక్తిగత జీవితంపై మళ్లీ చర్చ మొదలైంది. ఆయన భార్య సంగీతతో విభేదాలు వచ్చాయన్న వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే పార్టీ స్పందిస్తూ, ఇది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం అని పేర్కొంది. ఇదే సమయంలో సంగీత గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. సంగీత స్వర్ణలింగం లండన్‌లో స్థిరపడిన శ్రీలంక తమిళ పారిశ్రామికవేత్త కుమార్తెగా గుర్తింపు పొందారు. 1996లో విడుదలైన ‘పూవే ఉనక్కాగా’ సినిమా చూసి విజయ్‌కు ఆమె వీరాభిమానిగా మారినట్లు చెప్పుకుంటారు. లండన్ యూనివర్సిటీలో చదువుతున్న సమయంలోనే ఆమె విజయ్‌కు అనేక లేఖలు రాసినట్లు సమాచారం.
విజయ్ను ప్రత్యక్షంగా కలవాలనే ఉద్దేశంతో లండన్ నుంచి చెన్నైకి వచ్చిన సంగీత, షూటింగ్ సెట్లో ఆయనను కలిసి అభినందనలు తెలిపింది. ఆ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, పెద్దల సమక్షంలో 1999 ఆగస్టు 25న వీరిద్దరూ వివాహ బంధంలో అడుగుపెట్టారు. ఈ దంపతులకు జాసన్ సంజయ్, దివ్యసాష అనే ఇద్దరు సంతానం ఉన్నారు.సంగీత సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్‌గా ఉండరు. నివేదికల ప్రకారం ఆమెకు సుమారు రూ.400 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ప్రచారం ఉంది. అయితే 2023లో విజయ్–సంగీత మధ్య విభేదాలు వచ్చాయని, ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారన్న వార్తలు వెలువడ్డాయి. అదే సమయంలో విడాకులు తీసుకోబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. తాజాగా తమిళనాడులో ఎన్నికలు సమీపిస్తున్న వేళ, విజయ్‌పై పొలిటికల్ ఫోకస్ మరింత పెరిగిన నేపథ్యంలో ఆయన భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారాయి.
ఈ వార్తలపై టీవీకే పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ నాయకుడి వ్యక్తిగత జీవితం గురించి చర్చించడం అనవసరమని, అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం అని స్పష్టం చేసింది. వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించాలని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసింది. మన లక్ష్యం ప్రజల సేవ. రాబోయే ఎన్నికలే మన ముందున్న ప్రధాన కర్తవ్యం. వ్యక్తిగత అంశాలపై కాకుండా ప్రజల సమస్యలపై దృష్టి సారిద్దాం అని పార్టీ పేర్కొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ ప్రచారంపై స్పష్టత కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.