గూడూరులో కల్తీ కోళ్ల దాణా పట్టివేత
మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న కల్తీ కోళ్ల దాణాను తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ బృందం పట్టుకుంది. రెండు డిసీఎం వాహనాల్లో తరలిస్తున్న దాదాపు 30 టన్నుల కల్తీ దాణాను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు.
మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 17 : మిర్యాలగూడ మండలం గూడూరు సమీపంలో అక్రమంగా తరలిస్తున్న కల్తీ కోళ్ల దాణాను తెలంగాణ పౌల్ట్రీ అసోసియేషన్ బృందం పట్టుకుంది. రెండు డిసీఎం వాహనాల్లో తరలిస్తున్న దాదాపు 30 టన్నుల కల్తీ దాణాను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఇటీవల మార్కెట్లో కోళ్ల దాణా ధరలు గణనీయంగా పెరగడాన్ని ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు ఈ దందాకు తెరలేపినట్లు పౌల్ట్రీ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ దాణాలో దాదాపు 60 శాతం వరకు రాయి పొడి, వరి పొట్టు కలిపి విక్రయిస్తున్నట్లు వారు గుర్తించారు. మిర్యాలగూడ కేంద్రంగా హాలియా, ఆంధ్రప్రదేశ్‌లోని పిడుగురాళ్ల నుండి హైదరాబాద్ మార్కెట్‌కు ఈ కల్తీ దాణా భారీగా సరఫరా అవుతోందని వెల్లడించారు. అనుమానంతో కొంతకాలంగా నిఘా ఉంచి వాహనాలను చాకచక్యంగా పట్టుకున్నట్లు చెప్పారు. కల్తీ దాణా తినడం వల్ల కోళ్లకు లివర్, కిడ్నీ సంబంధిత సమస్యలు వచ్చి పెద్ద ఎత్తున చనిపోతున్నట్లు పౌల్ట్రీ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి నిఘా పెంచాలని పౌల్ట్రీ ఫామ్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

