Bala Krishna | గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో టాలీవుడ్లో దూసుకుపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు సాధిస్తూ ఉండడంతో బాలయ్య మార్కెట్ మరింత బలపడింది. మాస్ ఇమేజ్, ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అభిమానులను అలరిస్తూ నిర్మాతల ఫస్ట్ ఛాయిస్‌గా మారారు. ఇప్పుడు ఈ ఉత్సాహంలోనే బాలకృష్ణకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయతో బాలయ్య సినిమా దాదాపు ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. విభిన్నమైన కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ, ఈసారి బాలయ్య మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఈ కథ స్పాన్ చాలా పెద్దదిగా ఉండనుందని, అందుకే దీనిని ఒకే భాగంగా తీసుకురావాలా లేదా రెండు భాగాలుగా విభజించాలా అన్న అంశంపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ ప్రాజెక్ట్ మాత్రం భారీ స్థాయిలో ఉండబోతుందనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా బాలకృష్ణ ఇప్పటికే దర్శకుడు గోపిచంద్ మలినేనితో మరో సినిమా చేస్తున్నారు. మొదట పీరియాడికల్ కథలో బాలయ్య మహారాజుగా కనిపించనున్నారని వార్తలు వచ్చినప్పటికీ, బడ్జెట్ పరిమితుల కారణంగా కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలయ్య ముంబై బ్యాక్‌డ్రాప్‌లో మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారని టాక్.
ఈ ప్రాజెక్ట్ మార్చి 5న ప్రారంభం కానుండగా, దసరా సందర్భంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మలినేని స్టైల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది.ఇక బాలయ్య–వివేక్ ఆత్రేయ కాంబినేషన్ చిత్రాన్నిమైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అనూహ్య కలయిక టాలీవుడ్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మాస్ హీరో బాలయ్యను సాఫ్ట్, ఎమోషనల్ కథలకు పేరుగాంచిన వివేక్ ఆత్రేయ ఎలా కొత్త కోణంలో ప్రెజెంట్ చేస్తారో అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. వివేక్ ఆత్రేయ ఇప్పటికే బ్రోచెవారెవరురా, అంటే సుందరానికి వంటి చిత్రాలతో తన ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. క్లీన్ కామెడీ, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కథన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి దర్శకుడు ఇప్పుడు బాలయ్య మాస్ ఇమేజ్ను ఎలా మలుస్తారో చూడాలని సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, గతంలో వివేక్ ఆత్రేయ సూపర్ స్టార్ రజనీకాంగ్కి ఒక కథ వినిపించారని ప్రచారం కూడా వినిపించినప్పటికీ, దానిపై ఎలాంటి అధికారిక అప్డేట్ లేదు. మొత్తానికి బాలయ్య–వివేక్ ఆత్రేయ కాంబినేషన్ నిజమైతే, ఇది బాలకృష్ణ కెరీర్లో వినూత్నమైన ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఇండస్ట్రీ, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.