Mukhara Womens | తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలుపై ముఖరా కె మహిళల నిరసన.. సోనియా, రాహుల్‌గాంధీకి పోస్టు కార్డులు
Mukhara Womens | సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందంజలో ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామ మహిళలు మహిళా దినోత్సవం రోజున సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఆదిలాబాద్ : సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందంజలో ఉంటూ ఆదర్శంగా నిలుస్తున్న ఆదిలాబాద్ జిల్లా ముఖరా కె గ్రామ మహిళలు (Mukhara Womens) మహిళా దినోత్సవం రోజున సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ( Congress ) ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారంటీలలో ( Six Guarntees) భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చెయ్యాలని సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీకి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు ( Post Cards ) పంపి నిరసన తెలిపారు.

తెలంగాణలో ఎన్నికల సమయంలో ప్రతి మహిళకు నెలకు రూ. 2,500లు, పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి తో పాటు తులం బంగారం, డిగ్రీ చేసిన ఆడపిల్లకు స్కూటీలు ఇస్తానని చెప్పి అధికారంలో వచ్చి 27 నెలలు అవుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంకా హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు.
దేవుళ్ల మీద ఒట్లు వేసి ప్రజలను మభ్య పెట్టాడని, కాంగ్రెస్ ప్రభుత్వాన్నీ నమ్మి మోసపోయామని వారు పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామంలోని మహిళలందరు కలిసి పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరాలు పంపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, దైవశాల, సరోజ, లక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
Rayapol SI | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు.. రాయపోల్ ఎస్ఐ స్ట్రాంగ్ వార్నింగ్
Abhijeet Dipke: విమానంలోనే దీప్కే అరెస్టు..
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

