కర్రలతో కొట్టి, బూట్లతో ముఖంపై తొక్కి.. శ్రీచైతన్య స్కూల్లో పదో తరగతి విద్యార్థిపై దాడి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలోని శ్రీచైతన్య హైస్కూల్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దారుణంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డికి చెందిన అభిషేక్‌పై రాత్రి సమయంలో 12 మంది విద్యార్థులు కర్రలు, ప్లేట్లతో దాడి చేసి, బూట్లతో ముఖంపై తొక్కినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు.
దాడిలో అభిషేక్ తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. మెట్లపై నుంచి కిందపడిపోవడంతో తమ కుమారుడికి గాయాలయ్యాయని పాఠశాల యాజమాన్యం ఫోన్ చేసి చెప్పిందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. వెంటనే పాఠశాలకు వెళ్లి అభిషేక్‌ను ఇంటికి తీసుకొచ్చామని తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.
అయితే తనపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరుతో దాడి చేసినట్లు అభిషేక్ చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిపై దాడి చేసిన విద్యార్థులతోపాటు ఘటనను బయటకు రాకుండా దాచేందుకు ప్రయత్నించిన పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indigo Employee | ఇండిగో ఉద్యోగిని హత్య కేసు.. స్నేహితుడి భార్యే హంతకురాలు..!
రేపటి నుండి కోదాడలో 93వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం
Exercises | ఇంట్లోనే కండరాల పెరుగుదలకు 7 వ్యాయామాలు.. ఇవి చేస్తే చాలు..
నల్లగొండ విద్యార్థికి జాతీయ బాల ప్రతిభా పురస్కారం
భూముల రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి : అదనపు కలెక్టర్ హరిసింగ్
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

