లక్నో: ఒక మహిళ ఆస్తి కోసం తన అత్తను చంపింది. (Woman kills mother-in-law) ఆమె నగలను చోరీ చేసింది. మహిళ సోదరి, ఆమె ప్రియుడు దీనికి సహకరించారు. ఈ హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు షాక్ అయ్యారు. అత్తను చంపిన కోడలికి ఆమె భర్త సోదరులతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 24న కుంహారియా గ్రామానికి చెందిన 54 ఏళ్ల సుశీలా దేవి ఆమె ఇంట్లో అనుమానాస్పదంగా మరణించింది. రూ.8 లక్షల విలువైన ఆమె నగలు చోరీ అయ్యాయి.
కాగా, కేసు దర్యాప్తు చేసిన పోలీసులు కోడలైన పూజ తన సోదరి కమల, ఆమె ప్రియుడు అనిల్ వర్మతో కలిసి అత్త సుశీలా దేవిని హత్య చేసినట్లు తెలుసుకున్నారు. దీంతో పూజ, ఆమె సోదరిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అనిల్ నగలు అమ్మేందుకు ప్రయత్నించగా ఎన్కౌంటర్ చేసి పట్టుకున్నారు. చోరీ చేసిన నగలు, తుపాకీ, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఉమ్మడి భూమిలోని తన వాటా అమ్మి మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు వెళ్లాలని పూజ భావించిందని పోలీస్ అధికారి తెలిపారు. అత్త సుశీలా దేవి అభ్యంతరం చెప్పడంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు సోదరి, ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసిందని చెప్పారు.
కాగా, పూజ భర్త మరణించడంతో ఝాన్సీలో ఉన్న మరిది కళ్యాణ్ సింగ్‌తో సహజీవనం చేసిందని పోలీస్ అధికారి తెలిపారు. ఆరేళ్ల కిందట అతడు చనిపోగా మరో మరిది సంతోష్‌తో కూడా సంబంధాన్ని ఆమె కొనసాగించిందని చెప్పారు. అతడి ద్వారా ఆడ పిల్లను కన్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో తొమ్మిది నెలల కిందట సంతోష్ భార్య తన పుట్టింటికి వెళ్లిందని చెప్పారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
Also Read:
Watch: రైలు పట్టాలపై ఆటో నడిపిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: తనను చూసి మొరుగుతున్నదని.. కుక్కపై రిటైర్డ్ పీడబ్యూడీ ఇంజినీర్ కాల్పులు
Mooli Devi | పోలీసులనే బురిడీకొట్టించిన మహిళ.. పోలీస్ అకాడమీలో ఎస్ఐగా రెండేళ్లు ట్రైనింగ్