ముంబై: ఇద్దరు యువకుల మధ్య స్వలింగ సంపర్క సంబంధం ఉన్నది. ఆ యువకుడికి దూరంగా ఉంచేందుకు మైనర్ బాలుడి కుటుంబం ప్రయత్నించింది. కలత చెందిన యువకుడు కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఆ బాలుడ్ని హత్య చేశాడు. (boys Relationship Ends With murder) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 19 ఏళ్ల యువకుడు, 16 ఏళ్ల బాలుడి మధ్య స్వలింగ సంపర్క సంబంధం ఏర్పడింది. నాలుగు నెలల కిందట వారిద్దరూ నాగ్‌పూర్ వెళ్లి గడిపారు. ఈ విషయం తెలిసిన మైనర్ బాలుడి కుటుంబం అతడ్ని కట్టడి చేశారు. సంబంధం ఉన్న యువకుడిని కలవవద్దని, మాట్లాడవద్దని చెప్పారు.
కాగా, తనకు దూరంగా ఉండటంపై కలత చెందిన యువకుడు ఆ బాలుడ్ని హత్య చేయాలని ప్లాన్ చేశాడు. జూన్ 29న తన వద్దకు రప్పించాడు. కూల్ డ్రింక్‌లో విషం కలిపి ఇచ్చాడు. అది తాగిన బాలుడు వాంతి చేసుకున్నాడు. ఆ తర్వాత అక్కడి బెడ్‌పై మరణించాడు.
మరోవైపు కుమారుడు కనిపించకపోవడంతో బాలుడి కోసం తండ్రి వెతికాడు. ఆ యువకుడి వద్దకు వెళ్లినట్లు బాలుడి ఫ్రెండ్ చెప్పాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు ఆ యువకుడి ఇంటికి చేరుకున్నారు. బెడ్‌పై అచేతనంగా పడి ఉన్న కుమారుడ్ని చూశారు. ఆ పక్కనే ఆ యువకుడు కూడా కూర్చొని ఉన్నాడు.
కాగా, డాక్టర్‌ను పిలిపించగా ఆ బాలుడు మరణించినట్లు నిర్ధారించారు. దీంతో అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్వలింగ సంపర్క సంబంధానికి దూరంగా ఉన్నందుకు బాలుడ్ని ఆ యువకుడు హత్య చేశాడన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
AAP MLA Arrested | హత్యాయత్నం ఆరోపణలపై.. ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్
Woman kills mother-in-law | ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. భర్త సోదరులతో వివాహేతర సంబంధం
Watch: రైలు పట్టాలపై ఆటో నడిపిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?