భువనేశ్వర్: రిస్కీ రీల్ కోసం ముగ్గురు బాలురు ప్రయత్నించారు. ఒక బాలుడు రైలు పట్టాల మధ్యలో పడుకున్నాడు. అతడి మీదుగా రైలు వేగంగా దూసుకెళ్లింది. (Boy Lay On Tracks As Train Sped) ఆ తర్వాత అతడు పైకి లేచాడు. ఆ బాలురు సంబరపడ్డారు. వైరల్ అయిన ఈ వీడియో క్లిప్ పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని బౌధ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ముగ్గురు బాలురు కలిసి వైరల్ రీల్ కోసం ప్రయత్నించారు. పురునపాణి రైల్వే స్టేషన్‌కు సమీపంలోని దాలుపలి సమీపంలో రైలు పట్టాల మధ్యలో ఒక బాలుడు పడుకున్నాడు. వేగంగా వచ్చిన రైలు ఆ పట్టాలపై దూసుకెళ్లింది. ఆ తర్వాత ఆ బాలుడు పైకి లేచాడు. ఈ రీల్ తీసిన వారంతా సంబరపడ్డారు.
కాగా, ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. దీంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ ముగ్గురు మైనర్ బాలురను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘నేను పట్టాల మధ్యలో పడుకున్నా. రైలు వెళ్తున్నప్పుడు నా గుండె వేగంగా కొట్టుకున్నది. నేను బతుకుతానని ఊహించలేదు’ అని ఆ బాలుడు చెప్పాడు. అయితే ప్రమాదకర స్టంట్లు చేయవద్దని యువతను పోలీసులు హెచ్చరించారు.
A minor boy performs a dangerous stunt by lying on a railway track as a train passes over him, while his friend records the video. The children’s families have been summoned to the police station in #Boudh district | #Odisha@NewIndianXpress @santwana99 @Siba_TNIE pic.twitter.com/ir6lvNp9QU
— TNIE Odisha (@XpressOdisha) July 6, 2025
Also Read:
Watch: రైలు పట్టాలపై ఆటో నడిపిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman kills mother-in-law | ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. భర్త సోదరులతో వివాహేతర సంబంధం