Nuclear Missile | పశ్చిమాసియాలో యుద్ధం.. అమెరికాలో ఖండాంతర అణు క్షిపణి పరీక్ష..!
Nuclear Missile | పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా (USA) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యంత శక్తిమంతమైన ఖండాంతర అణు క్షిపణిని అగ్రరాజ్యం పరీక్షించింది. ఈ అణు క్షిపణి పరీక్ష మంగళవారమే జరుగగా.. ఆ పరీక్షకు సంబంధించిన వివరాలు తాజాగా బయటికొచ్చాయి. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ బేస్ నుంచి మంగళవారం రాత్రి 11 గంటలకు మినిట్‌మ్యాన్-3 (Minuteman-III) బాలిస్టిక్ మిస్సైల్ (Ballistic Missile) ను అమెరికా ఎయిర్‌ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ పరీక్షించింది.
Nuclear Missile : పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా (USA) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యంత శక్తిమంతమైన ఖండాంతర అణు క్షిపణిని అగ్రరాజ్యం పరీక్షించింది. ఈ అణు క్షిపణి పరీక్ష మంగళవారమే జరుగగా.. ఆ పరీక్షకు సంబంధించిన వివరాలు తాజాగా బయటికొచ్చాయి. కాలిఫోర్నియా తీరంలోని వాండెన్‌బర్గ్ స్పేస్‌ఫోర్స్ బేస్ నుంచి మంగళవారం రాత్రి 11 గంటలకు మినిట్‌మ్యాన్-3 (Minuteman-III) బాలిస్టిక్ మిస్సైల్ (Ballistic Missile) ను అమెరికా ఎయిర్‌ఫోర్స్ గ్లోబల్ స్ట్రైక్ కమాండ్ పరీక్షించింది.
ఆయుధాల్లేని ఈ ఖండాంతర క్షిపణి మార్షల్ ఐలాండ్స్‌లో నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించినట్లు యూఎస్ స్పేస్‌ఫోర్స్ వెల్లడించింది. ఈ పరీక్ష విజయవంతమైందని, అత్యంత కచ్చితత్వంతో క్షిపణి లక్ష్యాన్ని చేరుకుందని తెలిపింది. క్షిపణిలోని ఒక్కో విభాగం పనితీరును స్పష్టంగా తెలుసుకునేందుకు ఈ పరీక్ష చేపట్టినట్లు యూఎస్ స్పేస్‌ఫోర్స్ పేర్కొన్నది. అయితే ఇరాన్ (Iran) పై దాడుల వేళ ఈ అణు క్షిపణి పరీక్ష నిర్వహించడం చర్చనీయాంశం అయ్యింది. మినిట్‌మ్యాన్-3లో అత్యంత శక్తిమంతమైన మార్క్-21 రీఎంట్రీ వెహికల్ ఉంటుంది.
దీనిలో న్యూక్లియర్ పేలోడ్‌ను అమర్చవచ్చు. జపాన్‌లోని హిరోషిమాపై జారవిడిచిన అణుబాంబు కంటే 20 రెట్లు శక్తిమంతమైన అణు వార్హెడ్లను ఇది మోసుకెళ్లగలదు. గతంలో పలుమార్లు దీని శక్తి సామర్థ్యాలను అమెరికా పరీక్షించింది. ఈ క్షిపణి గంటకు 15 వేల మైళ్ల వేగంతో 6 వేల మైళ్ల దూరం వరకు ప్రయాణించగలదు. దీన్ని ప్రయోగించిన కొన్ని నిమిషాల్లోనే లక్ష్యాన్ని ఛేదించగలదు. చివరగా గత ఏడాది నవంబర్‌లో మినిట్‌మ్యాన్-3ని అమెరికా పరీక్షించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

