అగర్తల: త్రిపురలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో టెన్షన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. (Tensions In Tripura BJP Coalition) కూటమి ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరిస్తామని తిప్రా మోథా పార్టీ (టీఎంపీ) ఎమ్మెల్యే రంజిత్ దేవ్బర్మ శనివారం హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీఫ్ ప్రద్యోత్ కిషోర్ మాణిక్య దేవ్బర్మ గవర్నర్ ఇంద్రసేన రెడ్డితో ఆదివారం సమావేశం కావడం కలకలం రేపింది. మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లావ్ కుమార్ దేబ్ టీఎంపీ చీఫ్‌ను కలిసిన తర్వాత ఈ పరిణామం జరిగింది. దీంతో సీఎం మాణిక్ సాహా నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో చీలికలపై ఊహాగానాలు వెల్లువెత్తాయి.
కాగా, 2024 మార్చిలో సంతకం చేసిన త్రైపాక్షిక ఒప్పందాన్ని అమలు చేయడంలో పురోగతి లేకపోవడం, అక్రమ చొరబాట్లపై తగిన చర్యలు తీసుకోకపోవడం, రాష్ట్రంలో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వలసదారులకు సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ మే నెలలో జారీ చేసిన నోటిఫికేషన్ తర్వాత టీఎంపీలో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకోవాలని యోచిస్తున్నది.
మరోవైపు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లకుగాను టీఎంపీ తొలిసారి ఒంటరిగా 42 స్థానాల్లో పోటీ చేసింది. 13 సీట్లు గెలిచింది. బీజేపీ, ఐపీఎఫ్టీ కూటమి కలిసి పోటీ చేశాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ 31 కంటే ఒక స్థానం అదనంగా 32 సీట్లలో బీజేపీ, ఐపీఎఫ్టీ ఒక స్థానంలో విజయం సాధించాయి. 33 సీట్ల ఆధిపత్యంతో తిరిగి అధికారంలోకి వచ్చాయి.
కాగా, గత ఏడాది మార్చిలో కేంద్రం, త్రిపుర ప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత బీజేపీ, ఐపీఎఫ్టీ సంకీర్ణ ప్రభుత్వంలో టీఎంపీ చేరింది. అయితే కూటమి ప్రభుత్వానికి మద్దతు వెనక్కి తీసుకోవాలని తాజాగా ఆ పార్టీ భావిస్తున్నది.
Also Read:
Himachal floods | కొట్టుకుపోయిన తల్లిదండ్రులు, అమ్మమ్మ.. ప్రాణాలతో బయటపడిన 11 నెలల పసి పాప
Bank Buried In Water | హిమాచల్ ప్రదేశ్‌లో నీట మునిగిన బ్యాంకు.. కోట్లలో నష్టం అంచనా
Watch: రైలు పట్టాల మధ్యలో పడుకున్న బాలుడు, వేగంగా వెళ్లిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?