పాల్వంచ, మార్చి 10 : మన డివిజన్ను మనమే బాగు చేసుకోవాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ సింధు అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో మంగళవారం పాల్వంచ పట్టణం 7వ డివిజన్లో చేపట్టిన పరిసరాల శుభ్రతా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, డ్రైనేజీ క్లీనింగ్, పిచ్చి మొక్కల తొలగింపు చేయించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ యూనస్, స్థానికులు పూజారి వెంకటేశ్వర్లు, కలే కాంతయ్య, గండూరి ప్రేమ కుమార్, అరుణ, ప్రమీల, నవ్య, ఎస్కే.మున్నీ, వెంకటేశ్ పాల్గొన్నారు.