Jharkhand | జార్ఖండ్‌లో రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లతేహర్ జిల్లాలో ఓ కంటైనర్ ట్రక్కు(Truck Collision)అదుపు తప్పి ఆటో రిక్షా, బైక్‌ను ఢీకొట్టడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేగంగా వచ్చిన ట్రక్కు ఆటో, బైక్‌ను ఢీకొట్టడంతో చంద్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘దేద్ తంగవా’ లోయలో పడింది.
ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రగిబ్ ఖాన్ (35), అఫసారి ఖాటూన్ (40), ఆమె కుమారుడు అస్జాద్ (7) ఉన్నారని , మరో ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉందని చంద్వా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ మనోరంజన్ ప్రసాద్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానాకి చేరుకొని స్థానికుల సహాయంతో ఆటోలోని డెడ్‌బాడీలను బయటలకు తీశారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం పరీక్షల కోసం సర్దార్ హాస్పిటల్‌కు తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.