దంచికొట్టిన వానలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరాన్ని తాకింది. దీంతో గురువారం జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. హనుమకొండ, జనగామ, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం, కుమ్రం భీం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి-కొత్తగూడెం, మంచిర్యాల, నల్లగొండ, పెద్దపల్లి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడ్డాయి.
- సగం రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
- పిడుగుపాటుకు ముగ్గురు కూలీలు మృతి
- నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
- మరో 2 రోజులు భారీ వర్షాలకు అవకాశం
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం అర్ధరాత్రి కళింగపట్నం వద్ద తీరాన్ని తాకింది. దీంతో గురువారం జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. హనుమకొండ, జనగామ, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్, ఖమ్మం, కుమ్రం భీం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి-కొత్తగూడెం, మంచిర్యాల, నల్లగొండ, పెద్దపల్లి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడ్డాయి. కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి.
బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర్లో చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్ల కప్పులు ఎగిరిపోయాయి. మణుగూరు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాలకు అధికారులు ఆరెంజ్ హెచ్చరిక జారీచేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, నల్లగొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఖమ్మం జిల్లాలో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని సూచించారు.
పిడుగుపాటు.. ముగ్గురు కూలీలు మృతి
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూరులో పొలం పనులకు వెళ్లిన మహిళలపై పిడుగు పడి ముగ్గురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వరి పొలంలో కలుపు తీస్తుండగా ఒకసారిగా పిడుగు పడి కుమ్మరి లక్ష్మి మృత్యువాతపడింది. ఎడ్ల యాదమ్మ కూలీ పనులకు వెళ్లి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో పిడుగుపడటంతో ఆమె మరణించారు.
పలు ప్రాంతాల్లో 10 సెం.మీపైగా..
సీజన్లో మొదటిసారి పలు జిల్లాల్లో 10 సెం.మీపైగా వర్షపాతం నమోదైనట్టు వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 12.36 సెం.మీ, పెద్దవంగరలో 11.86 సెం.మీ, మరిపెడలో 11.41 సెం.మీ, నెల్లికోడూరులో 10.83 సెం.మీ, చిన్నగూడురులో 10.34 సెం.మీ, మధిరలో 11.72 సెం.మీ, ముదిగొండలో 11.61 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

