హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలను పటిష్టంగా అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ నెలరోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లలో ఫైర్, ఎలక్ట్రికల్, స్ట్రక్చరల్ ఆడిటింగ్ నిర్వహించాలని సూచించారు. ఫైర్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్కు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేయాలని సమావేశంలో నిర్ణయించారు.