Suryapet | రెండు ప్రైవేట్ బస్సులు(Private travel buses) ఢీకొన్న ఘటనలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటన సూర్యాపేట(Suryapet )జిల్లా ముగాల మండలం ఆకు పాముల వద్ద జరిగింది. ప్రమాద సమయంలో బస్సుల్లో 63 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో బస్సులో ఇరుక్కున్న డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ల నిద్రమత్తే కారణమని తేల్చారు. తీటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Jharkhand | జార్ఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
AP News | ఏపీలో విషాదం.. కాలువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు గల్లంతు
KTR | సింగిల్ ఇంజిన్ సత్తా చూపెట్టినం.. అన్ని రాష్ర్టాల సమాన అభివృద్ధే అసలైన దేశభక్తి : కేటీఆర్