Shai Hope : నామమాత్రమైన మూడో వన్డేలో అద్భుత శతకంతో క్వీన్స్లీప్ తప్పించాడు వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్(Shai Hope). భారత బౌలర్లను కాచుకొని అజేయంగా నిలిచి అతడు జట్టును గెలిపించిన తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి. మ్యాచ్ అనంతరం బహుమతి ప్రదానం సందర్భంగా హోప్ మాట్లాడుతూ.. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ(MS Dhoni) సలహాతోనే టీమిండియాను ఓడించానని చెప్పాడు. కొన్ని రోజుల క్రితం ధోనీ చెప్పిన మాటలే తనను మ్యాచ్ విన్నర్‌ను చేశాయని వెల్లడించాడీ విండీస్ సారథి.
వరసగా రెండో వన్డేల్లో కంగుతిన్న వెస్టిండీస్ ఛండీగఢ్‌లో గొప్పగా పోరాడింది. కెప్టెన్ షాయ్ హోప్(162 నాటౌట్) సూపర్ సెంచరీతో కదంతొక్కగా వైట్‌వాష్ తప్పించుకుంది విండీస్. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ క్రీజులో పాతుకుపోయిన హోప్.. ఇన్నింగ్స్ నిర్మించిన తీరు, రన్‌రేటు తగ్గకుండా గేర్ మార్చి ఆడిన విధానం గొప్పగా ఉంది. ఒకప్పుడు చిన్న స్కోర్లకే వెనుదిరిగే అతడిని ‘ఈమధ్య భారీ స్కోర్లతో రాణించడానికి కారణం ఏంటీ?’ అని అడుగగా.. ఎంఎస్ ధోనీ పేరు చెప్పాడు.
Shai Hope: “A simple piece of advice from a very famous person MS Dhoni changed my ODI career completely.”
Thala Dhoni effect is real 💛🔥 https://t.co/N6M0iRJlSL
— Zenith. (@Msdcore7) October 3, 2026
‘ఓసారి ధోనీతో గొప్ప సంభాషణ జరిగింది. నీవు అనుకునేదానికంటే ఎక్కువ సమయం నీకు ఉంటుంది. అందుకు చివరి ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించకు. క్రీజులో ఉండి పరుగులు సాధించు. నీ స్టయిల్లో లక్ష్యాన్ని తగ్గిస్తూ వెళ్లు. ఆఖర్లో బౌండరీలపై దృష్టి పెట్టు అని ధోనీ నాకు సలహా ఇచ్చాడు’ అని హోప్ వెల్లడించాడు. అంతేకాదు భారత జట్టు స్లో ఓవర్ రేటు కూడా విండీస్‌కు కలిసొచ్చిందని అతడు తెలిపాడు.
WORDS OF WISDOM FROM THE GREAT MS DHONI! 💙🇮🇳
Shai Hope reveals the advice MS Dhoni gave him! 🗣️
#MSDhoni #INDvWI #ODIs #Sportskeeda https://t.co/WvIW0STxuI
— Sportskeeda (@Sportskeeda) October 4, 2026
మ్యాచ్‌లో టీమిండియా ఎన్ని ఓవర్లు వెనకబడి ఉందో తెలిసింది. దాంతో, మరో ఫీల్డర్‌ను వలయంలో పెడతారని అనుకున్నా. వలయంలో ఐదుగురు ఫీల్డర్లు మాత్రమే ఉన్నప్పుడు పరుగులను నియంత్రించడం అసాధ్యం. సో.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని డెత్ ఓవర్లలో బౌండరీలతో చెలరేగా అని హోప్ పేర్కొన్నాడు. మూడు వన్డేల్లో 112.09 స్ట్రయిక్ రేటుతో రెండు సెంచరీలతో కలిపి 278 పరుగులు సాధించాడు. వన్డే సిరీస్‌లో అదిరే బ్యాటింగ్ ప్రదర్శన చేసిన విండీస్ అక్టోబర్ 6 నుంచి టీ20ల్లో భారత్‌తో తలపడనుంది.