– కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్
– మునుగోడులో ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ
మునుగోడు, మార్చి 10 : మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో విద్యా నిర్విఘ్న ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు, పేద విద్యార్థులకు అండగా నిలవడానికి ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని వ్యవస్థాపక అధ్యక్షుడు బోల్గురి ముకేష్ ని కొనియాడారు.
ఇదే వేదికపై భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు, సామాజిక విప్లవకారిణి, జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే వర్ధంతిని నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లె రవికుమార్ మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే అది చదువుతోనే సాధ్యమని నమ్మిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఆమె ఆశయ సాధన కోసం విద్యా నిర్విఘ్న ఫౌండేషన్ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మునుగోడు సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహ గౌడ్, మాజీ ఎంపీటీసీలు పందుల భాస్కర్, జిట్టాగోని యాదయ్య, జేఏసీ చైర్మన్ తోట నరసింహ చారి, మాధవన్ రాజేష్ గౌడ్, అరెళ్ల సైదులు, అయితగోని విజయ్, పందుల మల్లేష్, పందుల సంపత్ కుమార్, రాజేష్, బొజ్జ అంజి, లింగస్వామి, గోపి, గాదె రాజు, రాకేశ్, నర్సింహా, శివరాజ్, బి.రాజు, హరిబాబు పాల్గొన్నారు.