లక్నో: సుమారు 15 అడుగుల పొడవున్న కొండచిలువను కొంతమంది పిల్లలు తమ చేతులతో మోసుకెళ్లారు. (Children Carry Python In Hands) మూడు కిలోమీటర్లకుపైగా దానితో సహా నడిచివెళ్లారు. సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆ కొండచిలువను వదిలేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జహంగీరాబాద్‌లోని డంగ్రా జాట్ గ్రామంలో 15 అడుగుల పొడవున్న భారీ కొండచిలువను గ్రామస్తులు చూశారు. కదలలేని స్థితిలో ఉన్న దానిని చూసి భయాందోళన చెందారు.
కాగా, ఆ గ్రామానికి చెందిన కొందరు పిల్లలు తమ చేతులతో ఆ కొండచిలువను మోసుకెళ్లారు. చాలా మంది దాని తల, మధ్య భాగం, తోక భాగాన్ని చేతులతో పట్టుకున్నారు. ఆ కొండచిలువను ఆట బొమ్మ మాదిరిగా ఆ పిల్లలు భావించారు. బులంద్‌షహర్, అనుప్షహర్ రోడ్డులో మూడు కిలోమీటర్ల మేర నడిచి వెళ్లారు. రోడ్డుపై వెళ్లేవారు ఇది చూసి ఆశ్చర్యపోయారు.
మరోవైపు ఆ పిల్లలు తమ చేతుల్లో ఉన్న కొండచిలువతో సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. ఆ తర్వాత సమీపంలోని అటవీ ప్రాంతంలో దానిని విడిచిపెట్టారు. అయితే అటవీ శాఖ అధికారులు లేదా స్థానిక పోలీసులకు ఈ సమాచారం తెలియలేదు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read:
Watch: రైలు పట్టాల మధ్యలో పడుకున్న బాలుడు, వేగంగా వెళ్లిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Tears Road By Hand | నాసిరకంగా రోడ్డు నిర్మాణం.. చేతితో పెకలించిన వ్యక్తి