పాట్నా: వివాహేతర సంబంధం ఆరోపణలతో ఒక మహిళకు ఆమె భర్త మేనల్లుడితో బలవంతంగా పెళ్లి చేశారు. (Woman Forced To Marry Husband’s Nephew) దీనికి ముందు వారిద్దరిని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన ఆ జంట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బీహార్లోని సుపాల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 4న భీంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల గ్రామానికి చెందిన ఒక మహిళ తన భర్త మేనల్లుడితో కలిసి ఉండగా గ్రామస్తులు పట్టుకున్నారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని ఆరోపించారు. ఆ మహిళతోపాటు యువకుడిని కర్రలతో కొట్టారు. ఆ తర్వాత వారిద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారు. మహిళ నుదుటపై అతడు సిందూరం పెట్టాడు.
కాగా, ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అయితే దాడి చేసిన వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన మహిళ, ఆ యువకుడిని పక్కనే ఉన్న నేపాల్లోని బిరత్నగర్ హాస్పిటల్కు చికిత్స కోసం తరలించారు.
మరోవైపు యువకుడి తండ్రి ఫిర్యాదుతో ఎనిమిది మంది వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కాగా, ఆ యువకుడిని కొట్టి మహిళతో బలవంతంగా పెళ్లి జరిపించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Bihar: Video of a youth being beaten up and forced to marry in Supaul goes viral on social media. The case is said to be related to an illicit relationship. The victim’s father filed an application in the police station; Bhimpur police have arrested a person in this case.… pic.twitter.com/ycGmI3QLte
— Matrize News Communications Pvt. Ltd (@Matrize_NC) July 8, 2025
Also Read:
Teachers Make Drugs | స్కూల్కు సెలవుపెట్టి.. కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్న సైన్స్ టీచర్స్
Doctor Jumps Off Bridge | భోజనానికి వస్తానని తల్లికి ఫోన్.. వంతెన పైనుంచి దూకిన డాక్టర్
Arvind Kejriwal | నా పాలనకుగాను.. నాకు నోబెల్ బహుమతి రావాలి: అరవింద్ కేజ్రీవాల్