న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనకు నోబెల్ బహుమతి రావాలని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంతరం అడ్డంకులు సృష్టించినప్పటికీ ఢిల్లీ ప్రజలకు మంచి పాలన అందించినట్లు తెలిపారు. దీనికిగాను నోబెల్ బహుమతికి తాను అర్హుడని అన్నారు. పంజాబ్‌లోని మొహాలిలో జరిగిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడారు. ‘మా ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలో ఉన్నంత కాలం పని చేయడానికి అనుమతించనప్పటికీ మేం పనిచేశాం. నేను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఢిల్లీలో చేసిన పనులు, పరిపాలనకు నోబెల్ బహుమతి పొందాలని నేను భావిస్తున్నా’ అని అన్నారు.
కాగా, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాపై అరవింద్ కేజ్రీవాల్ మడిపడ్దారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ఆప్ పథకాలు గాడితప్పేలా వ్యవహరించారని విమర్శించారు. ‘ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఢిల్లీలో మొహల్లా క్లినిక్‌లను ఆప్ నిర్మించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తులు తమ బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్‌కు బుల్డోజర్లను పంపి ఐదు మొహల్లా క్లినిక్‌లను కూల్చివేశారు. వారికి ఏమి లభించింది? మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ప్రభుత్వ మొహల్లా క్లినిక్‌లను కూల్చివేసింది’ అని అన్నారు.
మరోవైపు దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాలుగు నెలల్లో ఢిల్లీలో పరిస్థితి దిగజారిందని అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. మొహల్లా క్లినిక్‌లను మూసివేశారని ఆరోపించారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 20 వేల లీటర్ల ఉచిత నీరును తమ ప్రభుత్వం అందించిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వంలో ఈ పథకాలు గాడితప్పడంతో ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రాముఖ్యతను గ్రహిస్తున్నారని అన్నారు.
Also Read:
Watch: రెచ్చిపోయిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు.. టోల్గేట్ ధ్వంసం
Teachers Make Drugs | స్కూల్‌కు సెలవుపెట్టి.. కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్న సైన్స్ టీచర్స్
Doctor Jumps Off Bridge | భోజనానికి వస్తానని తల్లికి ఫోన్.. వంతెన పైనుంచి దూకిన డాక్టర్