ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తల ఆగడాలు మితిమీరుతున్నాయి. మరాఠీ భాషపై పోరాటం నేపథ్యంలో హిందీ మాట్లాడేవారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా పలు టోల్గేట్లను వారు ధ్వంసం చేశారు. (MNS Workers Vandalise Toll Booth) ఒక టోల్ బూత్ ధ్వంసానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు ఎంఎన్ఎస్ కార్యకర్తలు వాషిమ్‌లోని తోండ్గావ్ టోల్‌గేట్‌ను ధ్వంసం చేశారు. చేతుల్లోని ఐరాన్ రాడ్లతో టోల్ ప్లాజా అద్దాలను వారు పగులగొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఎంఎన్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజు పాటిల్ కిడ్సే తమ కార్యకర్తల చర్యను సమర్థించాడు. రహదారి నిర్మాణం పూర్తికానప్పటికీ టోల్ ప్లాజా ప్రారంభించి టోల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆరోపించాడు. ఈ అంశంపై పలు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ ఎవరూ స్పందించలేదని అన్నాడు.
#MNS goons vandalise Tondgaon toll plaza located on the Akola-Nanded highway in #Maharashtra on Wednesday, as a protest against toll charges being imposed on a road stretch that is still under construction. pic.twitter.com/nIu6iX9yvJ
— Harsh Trivedi (@harshtrivediii) July 9, 2025
Also Read:
Doctor Jumps Off Bridge | భోజనానికి వస్తానని తల్లికి ఫోన్.. వంతెన పైనుంచి దూకిన డాక్టర్
Man Tears Road By Hand | నాసిరకంగా రోడ్డు నిర్మాణం.. చేతితో పెకలించిన వ్యక్తి
Watch: రైలు పట్టాల మధ్యలో పడుకున్న బాలుడు, వేగంగా వెళ్లిన రైలు.. తర్వాత ఏం జరిగిందంటే?