Teachers Make Drugs | స్కూల్‌కు సెలవుపెట్టి.. కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్న సైన్స్ టీచర్స్
Teachers Make Drugs | ఇద్దరు సైన్స్ టీచర్లు కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్నారు. ప్రభుత్వ స్కూల్లో పని చేస్తున్న ఒక ఉపాధ్యాయుడు, కోచింగ్ సెంటర్లో ఉన్న మరో టీచర్ దీని కోసం సెలవుపెడుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఒక ఇంటిపై రైడ్ చేశారు.
జైపూర్: ఇద్దరు సైన్స్ టీచర్లు కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్నారు. (Teachers Make Drugs) ప్రభుత్వ స్కూల్లో పని చేస్తున్న ఒక ఉపాధ్యాయుడు, కోచింగ్ సెంటర్లో ఉన్న మరో టీచర్ దీని కోసం సెలవుపెడుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఒక ఇంటిపై రైడ్ చేశారు. డ్రగ్స్ తయారు చేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు. 25 ఏళ్ల మనోజ్ భార్గవ్, ముక్లావాలోని ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్లో సైన్స్ టీచర్‌గా పని చేస్తున్నాడు. మాజీ ఫిజిక్స్ టీచర్ ఇంద్రజీత్ విష్ణోయ్ ఒక కోచింగ్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నాడు. రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఆర్ఏఎస్) కోసం అతడు ప్రిపేర్ అవుతున్నాడు.
కాగా, ఈ ఇద్దరు సైన్స్ టీచర్లు కలిసి శ్రీ గంగానగర్ ప్రాంతంలోని అద్దె అపార్ట్మెంట్లో రహస్యంగా డ్రగ్స్ తయారు చేస్తున్నారు. కావాల్సిన పరికరాలు, రసాయనాలు ఢిల్లీ నుంచి కొనుగోలు చేశారు. అప్పుడప్పుడు సెలవు తీసుకున్న వీరిద్దరూ గత రెండున్నర నెలల్లో రూ.15 కోట్ల విలువైన ఐదు కిలోల మెఫెడ్రోన్ తయారు చేశారు. ఇందులో 4.22 కిలోల డ్రగ్స్‌ను అమ్మారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఆ ఇంటిపై రైడ్ చేశారు. రూ.2.34 కోట్ల విలువైన 780 గ్రామల మెఫెడ్రోన్ డ్రగ్, దాని తయారి కోసం వినియోగించిన పరికరాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు టీచర్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నవారిని, ఇందులో పాత్ర ఉన్న ఇతర వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎన్సీబీ అధికారి తెలిపారు. రాష్ట్రంలోని డ్రగ్ సిండికేట్‌లో ఇది అతిపెద్దదని వెల్లడించారు.
Also Read:
Doctor Jumps Off Bridge | భోజనానికి వస్తానని తల్లికి ఫోన్.. వంతెన పైనుంచి దూకిన డాక్టర్
Watch: రెచ్చిపోయిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు.. టోల్గేట్ ధ్వంసం
Watch: 15 అడుగుల కొండచిలువను చేతులతో మోసుకెళ్లిన పిల్లలు.. వీడియో వైరల్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Balakrishna | బాలకృష్ణ శివ నిర్వాణ దర్శకత్వంలో?
Benjamin Netanyahu | నెతన్యాహుకు దక్కని మెజారిటీ.. ఇజ్రాయెల్ ప్రభుత్వ ఏర్పాటులో అనిశ్చితి
Congress MLA | ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?.. ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
Stalin | ఓటు హక్కు ప్రత్యేక సౌకర్యం కాదు.. అది రాజ్యాంగం కల్పించిన హక్కు
Allahabad High Court | జడ్జి అనుచిత ప్రవర్తన..కోర్టులో లాయర్ల విధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

