న్యూఢిల్లీ: ఒక పక్క విద్యార్థులు నీట్ లీకేజీ లాంటి ప్రధాన సమస్యలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే ప్రధాని మోదీ అనుసరించిన వైఖరిని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎద్దేవా చేశారు. విద్యార్థుల సమస్యలపై స్పందించడానికి బదులుగా మోదీ వారికి చేరువ కావడం కోసం సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చేశారని విమర్శించారు.
అలాంటప్పుడు ఆయన ప్రధాన మంత్రి పదవి నుంచి దిగిపోయి ఇన్ఫ్లూయెన్సర్గా మారాలని వ్యం గ్యంగా పేర్కొన్నారు. ‘మోదీ ఇన్ఫ్లూయెన్సర్గా ఉండటానికే ఎక్కువగా సరిపోతారని అనిపిస్తున్నదని అన్నారు.