CJP’s Abhijeet Dipke | ప్రజాస్వామ్యం గెలిచింది.. విద్యార్థుల సామూహిక సంకల్ప విజయమిది: అభిజీత్ దీప్కే
Abhijeet Dipke | విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, విద్యార్థులు సాధించిన విజయంగా పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే హర్షం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, విద్యార్థులు సాధించిన విజయంగా పేర్కొన్నారు. (CJP’s Abhijeet Dipke) నీట్ పేపర్ లీక్ వివాదంపై కొన్ని వారాలుగా కొనసాగిన నిరసనల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేలా విద్యార్థులు ఒత్తిడి తెచ్చారని అన్నారు. ప్రజాస్వామ్య విలువలకు, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల సామూహిక సంకల్పానికి లభించిన విజయమని ఆయన అభివర్ణించారు.
కాగా, నిరంతర శాంతియుత నిరసనలు మార్పును తీసుకురాగలవని చెప్పడానికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఒక నిదర్శనమని అభిజీత్ దిప్కే తెలిపారు. ‘ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మీరు భయపడకపోతే, ఈ ప్రభుత్వానికి తలొగ్గకపోతే, మనం ఎవరితోనైనా రాజీనామా చేయించగలమని చెప్పడానికి ఇది నిదర్శనం’ అని అన్నారు.
అలాగే నీట్ పేపర్ లీక్ వివాదం తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల పేర్లను దీప్కే గుర్తు చేసుకున్నారు. వారి స్మృతి కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని నిరసనకారులను కోరారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై నిరసన ప్రాంగణంలో విద్యార్థుల సంబరాలు హోరెత్తాయి.
We have done it, says CJP founder Abhijeet Dipke after Dharmendra Pradhan resigns. pic.twitter.com/kcVA1SOfqh
— News Arena India (@NewsArenaIndia) July 25, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

