Navdeep | నీట్ పేపర్ లీకేజీ అంశంలో కాక్రోచ్ జనతా పార్టీతోపాలు విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) రాజీనామా కోరడంతో పలు డిమాండ్లతో ఢిల్లీలో ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. జూలై 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన చలో పార్లమెంట్ హింసాత్మకంగా మారింది. విద్యార్థి లోకంతోపాటు విపక్షాలు కూడా తమ గళాన్ని తీవ్రం చేశాయి.
ఇప్పటికే సినీ ఇండస్ట్రీ నుంచి ప్రకాశ్ రాజ్, కమల్ హాసన్, విజయ్ సేతుపతి, తరుణ్ భాస్కర్, ప్రదీప్ రంగనాథన్, దుల్కర్ సల్మాన్, సోనూ సూద్, రితేష్ దేశ్‌ముఖ్, వాణి కపూర్, అదితి రావు హైదరి, ఈషా రెబ్బా, రవీనా టాండన్, డైరెక్టర్ ఇంతియాజ్ అలీ, మ్యూజిక్ డైరెక్టర్ దిల్జిత్ దోసాంజ్, సల్మాన్ ఖాన్ మద్దతు పలికారు. అయితే ఈ అంశంపై టాలీవుడ్ యాక్టర్ నవదీప్ తనదైన శైలిలో భిన్నంగా స్పందించాడు.
ప్రభుత్వానిది తప్పంటే యాంటీ-నేషనలిస్ట్ అంటారు.. పోలీసులు ముందు స్టూడెంట్సే కొట్టారంటారు.. కాదు మేం సైలెంట్‌గా ఉంటే పోలీసులు కొట్టారని విద్యార్థులంటారు. స్టూడెంట్స్‌ది తప్పంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు. ఒపినీయన్ చెప్తే నీకెం తెలుసంటారు.. చెప్పకపోతే నువ్వేం చేయలేదంటారు. క్యా హై ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, క్యా హై డెమోక్రసీ. మీరు నిలబడండి లేదా కూర్చోండి.. రండి.. నన్ను కొట్టండి.. అని అంటూ కామెంట్ చేశాడు నవదీప్. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాగా కేంద్ర మంత్రి సీజేపీ, విద్యార్థులతో ఆందోళనలతో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చివరకు తన పదవికి రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ తన ఎక్స్ అకౌంట్లో .. హిందీ భాషలో ఓ లేఖను రిలీజ్ చేశారు.
ప్రభుత్వానిది తప్పంటే యాంటీ-నేషనలిస్ట్ అంటారు
స్టూడెంట్స్‌ది తప్పంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారు
ఒపీనియన్ చెబితే నీకేం తెలుసంటారు.. చెప్పకపోతే నువ్వేం చేయలేదంటారు
– నవదీప్ https://t.co/02DibK0qhq pic.twitter.com/anfK2LD1se
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2026