ముంబై: స్కూల్ టాయిలెట్లో రక్తపు మరకలు కనిపించాయి. దీంతో బాలికల దుస్తులు విప్పించి పీరియడ్స్ కోసం టీచర్లు చెక్ చేశారు. (Girls Striped For Periods Check) ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆ స్కూల్ వద్ద నిరసన చేపట్టారు. స్కూల్ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 8న షాహాపూర్‌లోని ఆర్ఎస్ దమాని స్కూల్ టాయిలెట్లో రక్తపు మరకలు కనిపించాయి.
కాగా, 5 నుంచి పదో తరగతి చదువుతున్న అమ్మాయిలను ఆ బాత్రూమ్ వద్దకు రప్పించారు. విద్యార్థినుల్లో ఎవరికైనా పిరియడ్స్ వచ్చాయా అని అడిగారు. టీచర్లు కొంతమంది బాలికల లోదుస్తులు విప్పించి చెక్ చేశారు. ఈ సంఘటనతో విద్యార్థినులు షాక్ అయ్యారు. ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పారు.
మరోవైపు బుధవారం పేరెంట్స్ పెద్ద సంఖ్యలో ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. స్కూల్ యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. రుతుస్రావం సహజ ప్రక్రియ గురించి విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించడానికి బదులు వారిని మానసికంగా వేధించడంపై మండిపడ్డారు. ఇది సిగ్గుచేటు, అసహ్యకరమైన చర్య అని విమర్శించారు. స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి అతడ్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ఈ విషయం తెలిసిన పోలీసులు ఆ స్కూల్ వద్దకు చేరుకున్నారు. పేరెంట్స్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తున్నారు.
Also Read:
Watch: రెచ్చిపోయిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు.. టోల్గేట్ ధ్వంసం
Doctor Jumps Off Bridge | భోజనానికి వస్తానని తల్లికి ఫోన్.. వంతెన పైనుంచి దూకిన డాక్టర్
Teachers Make Drugs | స్కూల్‌కు సెలవుపెట్టి.. కోట్ల విలువైన డ్రగ్స్ తయారు చేస్తున్న సైన్స్ టీచర్స్
Woman Forced To Marry Husband’s Nephew | భర్త మేనల్లుడితో.. మహిళకు బలవంతంగా వివాహం