జై నూర్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనురు మండలంలోని జంగావ్, ఉషెగాం ఓజ కళావృత్తులను ( Oja artistic handicrafts ) తెలంగాణ రాష్ట్ర సెర్ప్ టీం (SERP Team) అధికారి నాగరాజు, డీఆర్డీవో దత్తరాం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓజ కళాకారులు మరింత నైపుణ్యం సాధించే విధంగా తెలంగాణ రాష్ట్ర సెర్ప్ సహాయ పడుతుందని వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓజ కుల వృత్తులను బలోపేతం చేయడానికి కావలసిన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఓజ కళావృత్తులను బాహ్య ప్రపంచానికి తెలియజేసే విధంగా జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జై నూర్ ఏపీఎం సిహెచ్ శ్రీకాంత్, సర్పంచ్ అర్జున్, సీసీలు దత్త, సోమ్లా, వీవో ఎస్ దివ్య జ్యోతి, నిర్మల, ఓజా కులస్తులు ,తదితరులు పాల్గొన్నారు.