Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం తన కెరీర్లో కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం మా ఇంటి బంగారం సెట్స్‌లో హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సమంత తన చిత్ర బృందంతో కలిసి రంగుల పండుగను ఎంతో ఉత్సాహంగా సెలబ్రేట్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. హోలీ వేడుకల సందర్భంగా సమంత ఒక చిన్నపిల్లలా మారిపోయి సెట్స్‌లో రచ్చ చేసింది. చేతిలో పిచ్కారీ పట్టుకుని సహనటులపై నీళ్లు చల్లుతూ సరదాగా ఆటపట్టించింది. దీనికి ప్రతిగా చిత్ర బృందం సభ్యులు కూడా వాటర్ బెలూన్లతో సమంతపై రంగుల వర్షం కురిపించారు. దీంతో షూటింగ్ స్పాట్ మొత్తం రంగుల పండుగతో కళకళలాడిపోయింది.
ఈ వీడియోను షేర్ చేస్తూ సమంత “డిష్కియాన్… హ్యాపీ హోలీ బంగారాలు” అంటూ అభిమానులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. ఆమె ఉత్సాహాన్ని చూసి అభిమానులు కూడా కామెంట్లతో అభినందిస్తున్నారు. ఈ హోలీ వేడుకల్లో నటీనటులతో పాటు చిత్ర దర్శకురాలు బి.వి. నందిని రెడ్డి కూడా పాల్గొనడం విశేషం. సమంత–నందిని రెడ్డి మధ్య ఉన్న మంచి స్నేహం గురించి ఇప్పటికే తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. సెట్స్‌పై కనిపిస్తున్న ఈ సరదా వాతావరణం సినిమా అవుట్‌పుట్‌పై కూడా సానుకూల ప్రభావం చూపుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఇక సినిమా విషయానికి వస్తే, మా ఇంటి బంగారం చిత్రాన్ని మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ వేసవిలో థియేటర్లలో కలుద్దాం బంగారాలు అంటూ సమంత కూడా విడుదల తేదీని ధృవీకరించింది.ఈ సినిమా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతోంది. మనుషుల మధ్య ఉన్న సంబంధాలను సున్నితంగా చూపించే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. జనవరిలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.