భువనేశ్వర్: కొత్తగా పెళ్లైన జంటను గ్రామస్తులు అమానవీయంగా శిక్షించారు. సామాజిక నిబంధనలకు విరుద్ధంగా వివాహం చేసుకున్నందుకు ఆ జంటను ఎడ్ల మాదిరిగా కాడికి కట్టి పొలం దున్నించారు. (Newly-married couple tied to yoke) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒడిశాలోని రాయగడ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కంజామఝిరా గ్రామానికి చెందిన యువకుడు తన బంధువైన యువతిని పెళ్లి చేసుకున్నాడు.
కాగా, సామాజిక కట్టుబాటుకు విరుద్ధంగా వారిద్దరూ వివాహం చేసుకోవడంపై గ్రామస్తులు ఆగ్రహించారు. ఆ జంటకు అమానవీయ శిక్ష విధించారు. ఎడ్ల మాదిరిగా వారిని కాడికి కట్టి బలవంతంగా పొలం దున్నించారు. ఈ సందర్భంగా ఆ జంటను కర్రలతో కొట్టారు. ఆ తర్వాత వారిని ఆలయానికి తీసుకెళ్లి శుద్ధి ఆచారాలు చేయించారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో కొత్తగా పెళ్లైన జంటను అమానవీయంగా గ్రామస్తులు శిక్షించడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ గ్రామస్తులు తాలిబాన్ల మాదిరిగా ప్రవర్తించారని కొందరు మండిపడ్డారు.
కాగా, వ్యక్తిగత స్వేచ్ఛను హరించడంపై మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. అనాగరికంగా వ్యవహరించిన గ్రామస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.
When culture becomes vulture !
A scene from Rayagada district of #Odisha ! A boy n girl who love each other are forced to plough in public just like bullocks as punishment !
It’s inhuman indeed ! should be stopped @Ashok_Kashmir @irfhabib @BabelePiyush @amityadavbharat pic.twitter.com/4w2hNaMGy5— Amiya_Pandav ଅମିୟ ପାଣ୍ଡଵ Write n Fight (@AmiyaPandav) July 11, 2025
Also Read:
Jal Samadhi Protest | స్కూల్ వద్ద నిలిచిన నీరు.. మహిళా సామాజిక కార్యకర్త ‘జల సమాధి’ నిరసన
Man’s Phone Snatched | వ్యక్తి మొబైల్ ఫోన్ లాక్కెళ్లిన అగంతకుడు.. బయటపడిన భార్య వివాహేతర సంబంధం