– హాజరైన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 24 : భూదాన్ పోచంపల్లి మండలంలోని కనుముకుల గ్రామంలో శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం తిరు కల్యాణ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కల్యాణోత్సవంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేష్ యాదవ్, ప్రముఖ సినీ నటుడు శివాజీ తదితరులు హాజరయ్యారు. ఆలయాన్ని వారు సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు కోట మల్లారెడ్డి ప్రముఖులను శాలువా, మెమొoటోలతో ఘనంగా సత్కరించారు. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదం వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కోట మల్లారెడ్డి పుష్పలత, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కందాల భూపాల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చుక్క శోభాశంకర్, ఉప సర్పంచ్ పడమటి మహిపాల్ రెడ్డి, ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు కోట పాండురంగారెడ్డి, ప్రతినిధులు భోగ చంద్రశేఖర్, కోట అభిలాష్ రెడ్డి, బంధారపు సుమలత లక్ష్మణ్ గౌడ్, దుర్గం నరేష్, చిల్లర జంగయ్య, నూకల లింగస్వామి, రంగ మధు, కోట భూపాల్ రెడ్డి, కోట సత్తిరెడ్డి, మట్టిపల్లి ఐలయ్య, చింత కింది కిరణ్, పర్వతం అశోక్, నోముల ఉపేందర్ రెడ్డి, కటుకూరి శ్రీనివాస్, వేణుగోపాల చారి, మదన్ మోహన్ రెడ్డి, రంగారెడ్డి, నవీన్, తిరుమలేష్, నవీన్, రాములు, పారిజాత, భార్గవి, ఐశ్వర్య, మంజుల, మాధవి, అర్చకుడు వంశీకృష్ణమాచార్యులు పాల్గొన్నారు.