Isro Apprentice | ఇస్రోలో 410 అప్రెంటిస్ ఖాళీలు
Isro Apprentice | ఇస్రోలో కెరీర్‌ను ప్రారంభించాలనుకునే వారికి చక్కటి అవకాశం వచ్చింది. గ్రాడ్యుయేట్, టెక్నికల్, కమర్షియల్ అప్రెంటిస్ పోస్టులకు ఇస్రో నోటిఫికేషన్ విడుదల చేసింది.
Isro Apprentice | ఇస్రో 410 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC)లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. 2026-27 సంవత్సరానికి వీటిని నింపనున్నారు. నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ (NATS) పోర్టల్‌లో ఆగస్టు 28 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తిగలవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. తమ భవిష్యత్తును అభివృద్ధి చేసుకోవాలి.
ఖాళీలు
మూడు విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అవి.. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 220, టెక్నికల్ అప్రెంటిస్ 120, కమర్షియల్ అప్రెంటిస్ 70 ఖాళీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, మెకానికల్, కెమికల్, ఇండస్ట్రియల్, ఆటోమొబైల్, ఏరోనాటికల్, ఏరోస్పేస్, సివిల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ పూర్తి చేసి ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్‌లు సంబంధిత విభాగంలో డిప్లొమా సర్టిఫికెట్ కలిగి ఉండాలి. కమర్షియల్ అప్రెంటిస్‌లు డిప్లొమా ఇన్ కమర్షియల్ ప్రాక్టీస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 2022, 23, 24, 25, 26 సంవత్సరాల్లో అర్హతకు సంబంధించిన విద్యను పూర్తి చేసినవారే దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
అర్హులైన అభ్యర్థులు ముందుగా NATS (నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. తరువాత ఉమంగ్ (UMANG) పోర్టల్‌లో యూఆర్ఎస్సీ అప్రెంటిస్‌షిప్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దీనిలో NATSలో వచ్చిన ఎన్రోల్మెంట్/అప్రెంటిస్‌షిప్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఫొటో, సంతకం, ఇతర పత్రాలను అప్లోడ్ చేయాలి.
ఎంపిక
విద్యార్హతకు సంబంధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సొంత ఖర్చులతోనే వీటికి హాజరు కావాలి. ఎంపికైనవారికి నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు రూ. 12,300, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు రూ. 10,900, కమర్షియల్ అప్రెంటిస్‌లకు రూ. 10,900 స్టైపెండ్‌గా ఇస్తారు.
చివరితేదీ
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ ఆగస్టు 28. దరఖాస్తు విధానం, ఇతర వివరాలకు వెబ్సైట్ https://nats.education.gov.inలో చూడవచ్చు. ఉమంగ్ పోర్టల్ https://web.umang.gov.in/landing/
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

