రాంచీ: జార్ఖండ్‌లో కూలిన ఎయిర్ అంబులెన్స్(Air Ambulance)లో ఓ హోటల్ యజమానితో పాటు అతని భార్య, మరో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందేందుకు ఆ హోటల్ యాజమాని కుటుంబం ఎయిర్ అంబులెన్స్ కోసం సుమారు ఏడు లక్షలు అప్పు చేసినట్లు తెలిసింది. ఢిల్లీలో మెరుగైన చికిత్స పొందేందుకు ఎయిర్ అంబులెన్స్‌లో వెళ్లాల్సి వచ్చింది. దాని కోసం అతని కుటుంబం ఏడు లక్షలు అప్పులు చేసింది. కానీ ఎయిర్ అంబులెన్స్ కూలడంతో హోటల్ యజమాని సంజయ్ కుమార్ షా కుటుంబం తీవ్ర విషాదంలోకి వెళ్లింది.
ఇటీవల సంజయ్ కుమార్ హోటల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో సంజయ్‌కు సుమారు 65 శాతం గాయాలు అయ్యాయి. తొలుత రాంచీలో అతనికి చికిత్సను అందించారు. కానీ అక్కడ అతను పూర్తిగా కోలుకోలేకపోతున్నాడు. దీంతో రాంచీ ఆస్పత్రి వైద్యులు.. సంజయ్‌ను ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆస్పత్రికి తరలిస్తే మంచిదని సలహా ఇచ్చారు. అయితే కాలిన గాయాల వల్ల సంజయ్‌ను రోడ్డు లేదా రైలు మార్గంలో కానీ తీసుకెళ్లడం సాధ్యం కాదు. దీంతో ఎయిర్ అంబులెన్స్ అవసరం పడింది.
ఆ ఎయిర్ అంబులెన్స్‌లో వెళ్లేందుకు సంజయ్ కుటుంబం ఏడు లక్షల అప్పు కూడా చేసింది. ఎయిర్ అంబులెన్స్ కోసం తెచ్చిన డబ్బు నుంచి కొంత డబ్బును ఢిల్లీలో చికిత్స కోసం దాచారు. సంజయ్, అర్చన దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎయిర్ అంబులెన్స్ ప్రమాదంలో డాక్టర్ వికాశ్ కుమార్ గుప్తా కూడా మరణించాడు. అతని స్టోరీ కూడా హృదయవిదారకరంగా ఉన్నది. వికాశ్‌ను ఉన్నత విద్య చదివించేందుకు అతని తండ్రి భూమిని అమ్మేశాడు. ఒడిశాలోని కటక్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన అతను మెరిట్ విద్యార్థిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ డాక్టర్‌కు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.