Arjun Tendulkar : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్లో కొత్త జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లలో అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) ఒకడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ తనయుడిగా మనందరికీ సుపరిచితుడైన అర్జున్ ఈసారి తనకు మరిన్ని అవకాశాలు వస్తాయనే ఆశాభావంతో ఉన్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడుతున్న ఈ పొడగరి ఆల్‌రౌండర్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్రాంచైజీని ఎందుకు వీడాల్సి వచ్చిందో చెప్పేశాడు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్ షోలో మాట్లాడిన అర్జున్ బెంచ్ మీద ఉండడం ఇష్టం లేకనే ముంబైని వదిలేశానని చెప్పాడు.
పంతొమ్మిదో సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్(LSG)కు ఆడుతున్న అర్జున్ టెండూల్కర్ ఈసారి తన ముద్ర వేయాలనుకుంటున్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ పొడగరి ఆల్‌రౌండర్ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని వీడడానికి దారి తీసిన కారణాలను వెల్లడించాడు. శుభంకర్ మిశ్రా పాడ్‌కాస్ట్‌లో తన మనసులోని మాటల్ని, బాధను వెళ్లగక్కాడీ యంగ్‌స్టర్.
Shubhankar Mishra asked Arjun Tendulkar where he sees himself in 5 years
In Indian team
IPL superstar
A happy person living his own wayHe chose: Happy person who never harms Anyone.
Means, Sachin Sir is not just a great batsman but great father Too.
— Shah (@Shahhoon1) April 1, 2026
‘ముంబై ఇండియన్స్ తరఫున మీరు కొన్ని మ్యాచ్‌లు ఆడారు. మీ స్వింగ్ కూడా బాగుంది. మీకు మరిన్ని అవకాశాలు వస్తామని ఊహించి ఉంటారు కదా? అని అడిగిన ప్రశ్నకు అర్జు్న్ ఏ ఆటగాడైనా సరే అలాగే అనుకుంటారు. ఎవరూ కూడా బెంచ్ మీద కూర్చోవాలని కోరుకోరు. అయితే.. అవకాశం వచ్చినప్పుడు బాగా కష్టపడి అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది’ అని అర్జున్ తెలిపాడు.
ఆది నుంచి వివాదాస్పదమవుతున్న ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధనపై కూడా అర్జున్ తన అభిప్రాయం పంచుకున్నాడు. ఆల్‌రౌండర్ అయినందున ఈ నియమాన్ని వ్యక్తిగతంగా తాను వ్యతిరేకిస్తానని అతడు అన్నాడు. ‘ఏ ఫార్మాట్లోనైనా పదకొండు మందిని ఎంచుకొని ఆడాల్సి ఉంటుంది. కానీ, ఐపీఎల్లో ఇంప్యాక్ట్ ప్లేయర్ నియమం ఉంది. అంతర్జాతీయ టీ20ల్లో, ఇతర దేశాల లీగ్‌లో ఇంప్యాక్ట్ ప్లేయర్ నిబంధన లేదు. ఈ నియమంతో ఆల్రౌండర్లకు అవకాశాలు రావడం లేదు. కాబట్టి.. వ్యక్తిగతంగా నేను ఈ నియమాన్ని వ్యతిరేకిస్తాను’ అని అర్జున్ వెల్లడించాడు.
🚨ASHWIN ON ARJUN TENDULKAR.🚨
He said🎙️- “A tough chance for Arjun to get a game right now. With established pacers like Shami, Avesh Khan, Mohsin Khan, and Mayank Yadav in the lineup, competition is very high. — chances only if injuries happen.”🤯pic.twitter.com/u24Qwv1xw2
— Sam (@Cricsam01) March 23, 2026
తొలి మ్యాచ్‌లో తమ జట్టు ఓటమిపై స్పందించిన అతడు .. లక్నో్ మిడిలార్డర్ పటిష్టంగా ఉందని, టీర్నోలో తాము పుంజుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకూ 5 ఐపీఎల్ మ్యాచుల్లో అర్జున్ 3 వికెట్లు తీశాడంతే. అతడి అత్యుత్తమ ప్రదర్శన.. 1/9.