Sanju Samson : పొట్టి ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ అర్ధ శతకాలతో రెచ్చిపోయిన సంజూ శాంసన్(Sanju Samson) ఐపీఎల్లో తొలిసారి కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నాడు. భారీ అంచనాల నడుమ చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జెర్సీతో ఆడుతున్న సంజూ తొలి మ్యాచ్‌లో తేలిపోయాడు. ఎంఎస్ ధోనీ(MS Dhoni) వారసత్వాన్ని కొనసాగిస్తాడని ఫ్రాంచైజీ, అభిమానులు అతడిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశాడీ హిట్టర్. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో తన మార్క్ విధ్వంసంతో రెచ్చిపోవాలని భావిస్తున్నాడు.
ఐపీఎల్లో తొలిసారి చెన్నై సూపర్ కింగ్స్(CSK)కు ఆడుతున్న సంజూ శాంసన్ మొదటి మ్యాచ్‌లో తేలిపోయాడు. ఎన్నో అంచనాల మధ్య పసుపు జెర్సీతో క్రీజులోకి వచ్చిన సంజూ.. రెండో ఓవర్లోన క్లీన్‌బౌల్డయ్యాడు. నంద్రె బర్గర్ వేసిన ఆ ఓవర్లో చివరి బంతికి డిఫెన్స్ ఆడాలనుకున్న శాంసన్ అంచనా తప్పగా.. బంతి మెరుపు వేగంతో ఆఫ్ స్టంప్‌ను ఎగరగొట్టింది. అంతే.. స్టాండ్స్‌లోని వందలాది మందిని నిరాశకు గురి చేసిన సంజూ భారంగా పెవిలియన్ బాట పట్టాడు.
Chahal has had the upper hand in this duel. Can Samson finally break free?#IPL2026 #CSKvsPBKS pic.twitter.com/T6PQRFV1sn
— ESPNcricinfo (@ESPNcricinfo) April 3, 2026
తొలి మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైన శాంసన్ పంజాబ్ కింగ్స్‌పై దంచేయాలనే కసితో ఉన్నుడు. పంజాబ్ కింగ్స్‌పై పిడుగల్లే విరుచుకుపడి సీఎస్కే ట్రంప్‌కార్డ్ అవ్వాలనుకుంటున్న శాంసన్ నెట్స్‌లో చెమటోడ్చాడు. మరి.. మైదానంలో అదరగొడతాడా? లేదా? లేదా అని కోట్లాది మంది ఆసక్తి కనబరుస్తున్నారు. ఫామ్ పరంగా ఏమాత్రం ఢోకా లేని అతడికి లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ నుంచి ముప్పు పొంచి ఉంది.

ఇప్పటివరకూ12 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు అతడు చాహల్ ఓవర్లో ఔటయ్యాడు. ఈ లెక్కన చూస్తే.. శాంసన్‌ను ఔట్ చేసేందుకు పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పిన్ మాంత్రికుడిని ఆయుధంగా ఉపయోగించే అవకాశముంది. మరోవైపు.. ఈ మ్యాచ్‌లో అర్ధ శతకంతో చెలరేగి ధోనీ వారసుడిగా ప్రశంసలు అందుకోవాలని శాంసన్ అనుకుంటున్నాడు. గాయం నుంచి కోలుకుంటున్న ధోనీ రెండు వారాలు అందుబాటులో ఉండడు. సో.. అటు వికెట్‌కీపర్, ఇటు ఓపెనర్‌గా రాణించి అతడు తాలాను తలపించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
సొంతగడ్డపై జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ విఫలమైనా సంజూ శాంసన్ మెరిశాడు. క్వార్టర్ ఫైనల్ లాంటి సూపర్ 8 చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై 97 నాటౌట్లో జట్టును గెలిపించాడు. ఆపై సెమీఫైనల్లోనూ అభిషేక్ త్వరగా ఔటైనా.. ఇంగ్లండ్ బౌలర్లను కాచుకున్న సంజూ 89 పరుగులతో రెచ్చిపోయాడు. ఫైనల్లోనూ ఈ కేరళ స్టార్ దంచేశాడు.

న్యూజిలాండ్ బౌలర్లను బాదేస్తూ అభిషేక్(52)తో కలిసి తొలి వికెట్‌కు 98 రన్స్ జోడించిన సంజూ హాఫ్ సెంచరీ( 89 పరుగులు)తో జట్టుకు భారీ స్కోరందించాడు. ఇషాన్ కిషన్(54), ఆఖర్లో శివం దూబే(26 నాటౌట్) ధనాధన్ ఆటతో కివీస్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది టీమిండియా. అనంతరం.. బుమ్రా(4-15), అక్షర్ పటేల్(3-27) విజృంభణతో బ్లాక్ క్యాప్స్ 159కే కుప్పకూలింది. 96 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసిన భారత జట్టు పొట్టిప్రపంచకప్ను నిలబెట్టుకుంది.