లక్నో: ప్రభుత్వ స్కూల్ వద్ద చాలా రోజులుగా వర్షం నీరు నిలిచి ఉన్నది. మూడగుల లోతున్న ఆ నీరు మురికిగా మారింది. దీంతో స్కూల్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సామాజిక కార్యకర్త ‘జల సమాధి’ ద్వారా నిరసన తెలిపింది. (Jal Samadhi Protest) స్కూల్ ముందు నిలిచిన నీటిని మోటార్ ద్వారా తొలగించాలని డిమాండ్ చేసింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూన్ 17న కురిసిన భారీ వర్షానికి మంఖేడ గ్రామంలో ప్రాథమిక పాఠశాల వద్ద మూడగుల మేర వర్షం నీరు చేరుకున్నది.
కాగా, స్కూల్ ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. దీంతో స్కూల్ వద్ద నిలిచిన నీటిని తొలగించాలని అధికారులను గ్రామస్తులు కోరారు. అయితే వారు పట్టించుకోలేదు. దీంతో మహిళా సామాజిక కార్యకర్త సావిత్రి చాహర్ అక్కడ తొలుత నిరసన తెలిపింది. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు.
మరోవైపు మురికిగా మారిన నిలిచిన నీటిలో ‘జల సమాధి’ పేరుతో సావిత్రి చాహర్ నిరసన చేపట్టింది. ఏడు గంటలపాటు ఆ మురికి నీటిలో ఆమె కూర్చొన్నది. అధికారులు స్పందించే వరకు అక్కడి నుంచి కదలబోనని చెప్పింది. గ్రామస్తులు కూడా ఆమె నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సమస్యను అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:
Man’s Phone Snatched | వ్యక్తి మొబైల్ ఫోన్ లాక్కెళ్లిన అగంతకుడు.. బయటపడిన భార్య వివాహేతర సంబంధం
Russian Woman Living In Cave | ఇద్దరు కూతుళ్లతో కలిసి.. ఏళ్లుగా గుహలో నివసిస్తున్న రష్యా మహిళ