Jaipal Yadav | కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి గుర్క మంగమ్మ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె.. మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఇవాళ మధ్యాహ్నం వారి స్వగ్రామమైన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం చల్లంపల్లిలో అంత్యక్రియలు జరగనున్నాయి.
కాగా, జైపాల్ యాదవ్ మాతృమూర్తి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కన్నతల్లి మరణంతో శోకతప్తులైన జైపాల్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు ఓదార్పునిస్తూ, కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గుర్క మంగమ్మ మరణం పట్ల బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. మంగమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. జైపాల్ యాదవ్, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.