అగర్తల: బంగ్లాదేశ్ ప్రియురాలు భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు కర్ణాటక వ్యక్తి సహాయం చేశాడు. (Man Helps Bangladeshi Lover To Cross) త్రిపురలోకి ప్రవేశించించిన ఆ మహిళను సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ప్రశ్నించిన తర్వాత త్రిపురలో ఉన్న ప్రియుడ్ని కూడా అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్‌లోని బోగ్రా జిల్లాకు చెందిన 35 ఏళ్ల మహిళ గతంలో ముంబైలోని ఒక బ్యూటీ పార్లర్లో, ఆ తర్వాత బెంగళూరులోని ఒక ప్రైవేట్ సంస్థలో పని చేసింది. ఈ సందర్భంగా బీదర్‌కు చెందిన కాంట్రాక్టర్ దత్తా యాదవ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు.
కాగా, కొంత కాలం తర్వాత ఆ మహిళ బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లింది. అయితే కర్ణాటకకు తిరిగి రావాలని ప్రియుడైన దత్తా యాదవ్ ఆమెను కోరాడు. తాను సహాయం చేస్తానని చెప్పిన అతడు త్రిపుర చేరుకున్నాడు. వీరిద్దరూ కలిసి రైలులో బెంగళూరు చేరుకోవాలని ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలో జూలై 9 బంగ్లాదేశ్ మహిళ ఎలాంటి పత్రాలు, వీసా లేకుండా త్రిపురలోకి అక్రమంగా ప్రవేశించింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న బీఎస్ఎఫ్ సిబ్బంది ఆ మహిళను అరెస్ట్ చేశారు. త్రిపుర పోలీసులకు ఆమెను అప్పగించారు. ఆ మహిళను ప్రశ్నించగా అక్రమ చొరబాటుకు ప్రియుడు దత్తా యాదవ్ సహకరించినట్లు తెలిపింది. దీంతో త్రిపురలో ఉన్న ఆమె ప్రియుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. బంగ్లాదేశ్ మహిళ అక్రమంగా దేశంలోకి ప్రవేశించడానికి సహాయం చేసిన ఏజెంట్లు ఎవర్నది దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Watch: తృణమూల్ నేత, బీజేపీ నాయకురాలు కలిసి.. కారులో మద్యం తాగిన వీడియో వైరల్
3 Men Rape Woman | మహిళపై ముగ్గురు అత్యాచారం.. ఇంట్లోని ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ చోరీ