Gas Cylinder | ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు మధ్య యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధం ప్రభావంతో చమురు, గ్యాస్ సరఫరాలు నిలిచిపోవడంతో భారత్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి నిత్యావసర వస్తువైన గ్యాస్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్ల దందా కొనసాగుతోంది.
ఇదే అదనుగా భావిస్తున్న దొంగలు ఈ సారి తమ టార్గెట్ ఓన్లీ గ్యాస్ సిలిండర్లే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దొంగలు అర్థరాత్రి ఓ ఇంట్లోకి దూరి గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో వెలుగుచూసింది. ద్వారకాతిరుమలలో ఓ ఇంట్లోకి దొంగలు నిన్న అర్ధరాత్రి చొరబడి గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్లారు.
పని మీద బయటికి వెళ్లొచ్చేసరికి సిలిండర్ కనిపించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అర్ధరాత్రి ఇంట్లో దూరి గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిన దొంగలు
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఓ ఇంట్లో నిన్న అర్ధరాత్రి గ్యాస్ సిలిండర్‌ను ఎత్తుకెళ్లిన దొంగలు
పని మీద బయటికి వెళ్లొచ్చేసరికి సిలిండర్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు pic.twitter.com/iRMfgeY47A
— Telugu Scribe (@TeluguScribe) March 14, 2026
Poorna | పూర్ణ ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మి.. రెండోసారి తల్లైన టాలీవుడ్ నటి
Seasonal Allergies | సీజన్ మారుతోంది.. ఈ సమయంలో వచ్చే అలర్జీల నుంచి ఇలా తప్పించుకోండి..
Uttar Pradesh | కెరీర్‌పై ఫోకస్ చేయమన్నందుకు కవల సోదరి హత్య.. 84 సార్లు కత్తితో పొడిచి చంపిన సోదరుడు