BC Vidyarthi Leaders | హనుమకొండ చౌరస్తా, మార్చి 14 : ఈ నెల 15న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ ఛైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఫీజు పోరు దీక్షను విజయవంతం చేయాలని కేయూ విద్యార్థి జేఏసీ చైర్మన్, బీసీ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆరేగంటి నాగరాజు గౌడ్ పిలుపునిచ్చారు.
శనివారం కేయూ మొదటి గేటు వద్ద ఫీజు పోరు దీక్ష కరపత్రాలను వారు ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టంలో ఉన్న విద్యార్థి లోకమంతా కూడా చీమలదండు వలే దండుగట్టి ఫీజుపోరు దీక్షను విజయవంతం చేయాలని విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. రాష్ర్ట ప్రభుత్వం 7500 కోట్ల రూపాయలను ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను మంజూరు చేయకపోవడం మూలంగా 22 మంది విద్యార్థులు తమ ఫీజులను తట్టుకోలేక ఉన్నద చదువులు చదువుకోలేక చదివిన కళాశాలలో మెమోలు టీసీలు తీసుకోలేక ప్రైవేటు రంగం పెడుతున్న ఇబ్బందులకి మానసికంగా కృంగిపోయి వారు చనిపోయారన్నారు.
రాష్ర్టంలో ఉన్న అన్ని డిగ్రీ, ఇంటర్మీడియట్ కాలేజీల నుంచి విద్యార్థులు పెద్దఎత్తున తరలివచ్చి ఫీజు పోరు దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి ఏజేఏసీ నాయకులు తాళ్ళపల్లి నరేష్‌గౌడ్ , రీసర్చ్ స్కాలర్స్ కందికొండ తిరుపతి, విష్ణు, శ్రీకాంత్, రమేష్, తిరుపతి, రాజు, నాగేష్ పాల్గొన్నారు.
Poorna | పూర్ణ ఇంట్లో అడుగుపెట్టిన మహాలక్ష్మి.. రెండోసారి తల్లైన టాలీవుడ్ నటి
Seasonal Allergies | సీజన్ మారుతోంది.. ఈ సమయంలో వచ్చే అలర్జీల నుంచి ఇలా తప్పించుకోండి..
Uttar Pradesh | కెరీర్‌పై ఫోకస్ చేయమన్నందుకు కవల సోదరి హత్య.. 84 సార్లు కత్తితో పొడిచి చంపిన సోదరుడు