మేడ్చల్, ఆగస్టు 15 : విధి నిర్వహణలో నిజాయితీని ప్రదర్శించిన మేడ్చల్ ఆర్టీసీ డిపో కండక్టర్‌కు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పురస్కారం లభించింది. ఇటీవల మేడ్చల్ డిపో బస్‌లో ప్రయాణిస్తూ ఒక ప్రయాణికుడు తన బ్యాగును మరిచిపోయాడు. ఆ బస్‌లో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న గోవింద్ బ్యాగును తెరిచి చూడగా రూ.2 లక్షల నగదుతో పాటు ఆపిల్ ల్యాప్‌టాప్ తదితర విలువైన వస్తువులు ఉన్నాయి. ఆ బ్యాగును డిపోకు తీసుకువచ్చి అధికారులకు అప్పగించారు. వారు ప్రయాణికుడిని గుర్తించి బ్యాగును అప్పగించారు. నిజాయితీని గుర్తించిన కలెక్టర్ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందజేశారు.